News February 13, 2025
రాయపోల్: రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి.. గ్రామస్థుల ఆందోళన
రాయపోల్ మండలం అంకిరెడ్డిపల్లి వద్ద రోడ్డు దాటుతున్న ఆటో డ్రైవర్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టగా అక్కడికక్కడే మృతి చెందాడు. వీర నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ జాలిగామ ఐలయ్య ఈరోజు సాయంత్రం సిమెంట్ కోసం అంకిరెడ్డిపల్లి వద్దకు వచ్చి ఆటోను నిలిపి రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందాడు. నిందితుడిని పట్టుకోవాలని గ్రామస్థులు గజ్వేల్ చేగుంట రహదారిపై ఆందోళన చేపట్టారు.
Similar News
News February 13, 2025
మెదక్: లేగ దూడపై చిరుత దాడి
మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్ శివారులో చిరుత పులి సంచారం రైతులను భయాందోళనకు గురిచేస్తుంది. బుధవారం రాత్రి గ్రామానికి చెందిన దాసరి పెద్ద ఎల్లయ్య వ్యవసాయ పొలం వద్ద పశువులపాకపై చిరుత పులి దాడి చేసి ఒక లేగ దూడను చంపేసింది. ఉదయం పశువుల పాకకు వెళ్లిన రైతు లేగ దూడపై చిరుత దాడిని గమనించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. బోను ఏర్పాటు చేసి చిరుతను బంధించాలని కోరారు.
News February 13, 2025
MDK: తమ్ముడిని చంపిన అన్నకు జీవిత ఖైదు
హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ సంగారెడ్డి న్యాయస్థానం తీర్పునిచ్చింది. వివరాలు.. రామచంద్రపురం బాంబే కాలనీకి చెందిన మహమ్మద్ ఇబ్రహీం(27) కుటుంబ తగాదాల కారణంగా తన సొంత తమ్ముడైన ఎండీ లతీఫ్(24)ను 2020, జనవరి 17న రాత్రి నిద్రపోతున్న సమయంలో గొడ్డలితో నరికి చంపాడు. స్నేహితుడు అశోక్ సహాయంతో నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి డెడ్ బాడీని తగలబెట్టారు. ఈ కేసులో నిందితుడికి తాజాగా శిక్ష పడింది.
News February 13, 2025
MDK: అనారోగ్యంతో మహిళా కానిస్టేబుల్ మృతి
సిద్దిపేట జిల్లా చేర్యాల పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న పైసా స్వప్న కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం మృతి చెందింది. దీంతో స్వప్న స్వగ్రామమైన వీరన్నపేటలో విషాదఛాయలు నెలకొన్నాయి. ఆమె మృతి పట్ల సీఐ ఎల్ శ్రీను, ఎస్ఐ నీరేష్, పోలీస్ సిబ్బంది, పలువురు నాయకులు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మృతురాలికి ఓ కుమారుడు ఉన్నాడు.