News August 11, 2024

రాయలసీమను సస్యశ్యామలం చేస్తాం: మంత్రి బీసీ

image

టీడీపీ ప్రభుత్వ హాయంలో రాయలసీమ సాగునీటి అవసరాలను గుర్తించి, సీమను సస్యశ్యామలం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం నంద్యాల జిల్లాలోని అవుకు రిజర్వాయర్ నుంచి గాలేరు నగరి సుజల స్రవంతి కాలువ ద్వారా కడప జిల్లాకు నీటిని విడుదల చేశారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, పులివెందుల ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి పాల్గొన్నారు.

Similar News

News September 18, 2024

వంద రోజుల ప్రణాళిక లక్ష్యాలను చేరుకోండి: కలెక్టర్

image

వంద రోజుల ప్రణాళికలో భాగంగా శాఖల వారిగా నిర్దేశించిన లక్ష్యాలను అక్టోబర్ రెండో తేదీ లోపు పూర్తిచేయాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం నంద్యాల జిల్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో 100 రోజుల ప్రణాళికల లక్ష్యాల ప్రగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. అటవీ ప్రాంతంలో వందరోజుల ప్రణాళికలో భాగంగా రిజర్వ్ ఫారెస్ట్ లో 1,83,600 మొక్కలను నాటామన్నారు.

News September 17, 2024

కర్నూలు: రూ.2 లక్షలు పలికిన మహాగణపతి లడ్డూ

image

కర్నూలు పాత నగరంలోని తుంగభద్ర నదీ తీరాన కొలువుదీరిన 63 అడుగుల మహాగణపతి విగ్రహం వద్ద జరిగిన లడ్డూ వేలం పాటలో కాంచనం సురేశ్ బాబు (స్వస్తిక్ డెవలపర్స్) రూ.2 లక్షలకు దక్కించుకున్నారు. నగరానికి చెందిన చింటూ, భరత్, వికాస్ స్వామివారి హుండీని రూ.1,45,000కు పాట పాడి దక్కించుకున్నారు.

News September 17, 2024

గుంటూరు ప్యాసింజర్ ట్రైన్‌లో మృతదేహం

image

డోన్ పట్టణం రైల్వేస్టేషన్‌లో గుంటూరు ప్యాసింజర్ ట్రైన్‌లోని టాయిలెట్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని మంగళవారం రైల్వే అధికారులు గుర్తించారు. మృతుడికి సుమారు 55 నుంచి 65 ఏళ్ల మధ్య వయసు ఉంటుందని తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.