News November 29, 2024
రాయలసీమలో వర్షాలు

బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో నేడు రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. రేపు అనంతపురం, సత్యసాయి, డిసెంబర్ 1న అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వివరించింది. వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
Similar News
News November 28, 2025
గుత్తి రైల్వే ఉద్యోగి భార్య సూసైడ్

గుత్తి ఆర్ఎస్లోని రైల్వే ఇన్స్టిట్యూట్ సమీపంలో ఉన్న క్వార్టర్స్‌లో నివాసముండే అసిస్టెంట్ లోకో పైలట్ రాహుల్ కుమార్ సతీమణి జ్యోతి (23) శుక్రవారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాహుల్ కుమార్ మూడేళ్లుగా ఇక్కడ పనిచేస్తున్నారు. భర్త డ్యూటీకి వెళ్లిన సమయంలో జ్యోతి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
News November 27, 2025
గుంతకల్లు: రాష్ట్ర స్థాయిలో సత్తా చాటిన రాజేశ్

గుంతకల్లు పట్టణంలోని ఓ కాలేజీలో చదువుతున్న ఇంటర్ విద్యార్థి రాజేశ్ వినుకొండలో జరిగిన రాష్ట్ర స్థాయి పరుగు పందెం పోటీలలో పాల్గొని 200, 400, 4×1000 పోటీలలో ప్రథమ స్థానం సాధించి లక్నోలో నిర్వహించే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజేశ్ జాతీయ పోటీలకు ఎంపికై కళాశాలకు పేరు తెచ్చారని అభినందించారు.
News November 27, 2025
అనంత: స్కూల్ బస్సుల ఫిట్‌నెస్‌పై తనిఖీ చేయనున్న అఫీసర్

ఈనెల 28 నుంచి డిసెంబర్ 4 వరకు జిల్లాలో అన్ని స్కూలు బస్సులను తనిఖీ చేయడం జరుగుతుందని ఉప రవాణా కమిషనర్ ఎం. వీర్రాజు తెలిపారు. అనంతపురం జిల్లా రవాణా శాఖ అధికారులు కూడా స్కూల్ బస్సులపై ప్రత్యేకంగా ఉంచాలన్నారు. అగ్నిమాపక పరికరాలు, ఎమర్జెన్సీ ఎగ్జిట్, స్పీడ్ గవర్నర్లు వాటి పనితీరు పట్ల సమగ్రంగా తనిఖీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే అన్ని విద్యాసంస్థల యాజమాన్యాలకు నోటీసులు పంపించామన్నారు.


