News June 15, 2024
రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలి: తులసిరెడ్డి

రాయలసీమలో హైకోర్టు కానీ, హైకోర్టు బెంచి కానీ ఏర్పాటు చేయాలని ఏపీసీసీ మీడియా ఛైర్మన్ డా.తులసి రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. వేంపల్లెలో ఆయన మాట్లాడుతూ.. 1937 నాటి శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాజధాని, హైకోర్టు రెండింటిలో ఒకదానిని రాయలసీమలో ఏర్పాటు చేయాలన్నారు. ఈ ఒప్పందాన్ని అనుసరించి 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు రాజధాని రాయలసీమ, హైకోర్టు కోస్తాలో ఏర్పాటు చేశారన్నారు.
Similar News
News November 21, 2025
కడప కలెక్టరేట్లో విశ్వవిద్యాలయాలపై సమీక్ష.!

కడప కలెక్టరేట్లో శుక్రవారం ఛైర్మన్ కూన రవి కుమార్ అధ్యక్షతన యోగివేమన యూనివర్సిటీ, ఇడుపులపాయ IIIT, హార్టికల్చర్ యూనివర్సిటీ, విశ్వవిద్యాలయాల పనితీరుపై పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ (PUC) సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శాసనమండలి సభ్యులు రామగోపాల్రెడ్డి మాట్లాడుతూ.. యూనివర్సిటీల పనితీరు మరింత మెరుగుపడేలా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
News November 21, 2025
రోడ్డు ప్రమాద మృతుడి కుటుంబానికి కడప SP సాయం

కడపలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన AR హెడ్ కానిస్టేబుల్ నారాయణ కుటుంబానికి జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ రూ.2.5 లక్షల ఆర్థికసాయాన్ని అందజేశారు. పోలీస్ సంక్షేమం కింద వితరణ నిధి నుంచి ఈ మొత్తాన్ని మృతుడి సతీమణి రమాదేవికి శుక్రవారం అందించారు. అంకితభావంతో పనిచేసే సిబ్బంది మరణం బాధాకరమని ఎస్పీ పేర్కొంటూ, కుటుంబానికి పోలీసు శాఖ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
News November 21, 2025
ప్రొద్దుటూరులో బెట్టింగ్ నిర్వాహకులు అరెస్ట్.!

పొద్దుటూరు పోలీసులు ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులను అరెస్టు చేశారు. వారినుంచి రూ.10.56 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ బెట్టింగ్ ముఠాలో కీలక వ్యక్తులైన ప్రొద్దుటూరు మండలం లింగాపురానికి చెందిన ధనికల వీరశంకర్, కాశినాయన మండలానికి చెందిన ఆర్ల చంద్ర యాదవ్ను శుక్రవారం డీఎస్పీ భావన ఆధ్వర్యంలో సీఐ సదాశివయ్య అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి నగదు స్వాధీనం చేసుకున్నారు.


