News October 18, 2024

రాయలసీమ యూనివర్సిటీలో విద్యార్థిపై సీనియర్ల దాడి

image

కర్నూలు రాయలసీమ యూనివర్సిటీలో అర్ధరాత్రి అలజడి చెలరేగింది. ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న సునీల్‌పై సుమారు 15 మంది సీనియర్ విద్యార్థులు దాడి చేశారు. యువకుడు తీవ్రంగా గాయపడటంతో తోటి విద్యార్థులు నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్నారు. గతంలో జరిగిన పలు ఘటనలను దృష్టిలో ఉంచుకుని, ఫ్రెండ్లీగా మాట్లాడాలంటూ విద్యార్థిని పిలిచి చితకబాదినట్లు తెలుస్తోంది.

Similar News

News October 25, 2025

జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

నంద్యాల జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాజకుమారి గణియా శనివారం పేర్కొన్నారు. తుఫాన్ నేపథ్యంలో ఈనెల 27, 28, 29 తేదీల్లో నంద్యాల జిల్లాకు భారీ వర్ష సూచన ఉన్నట్లు చెప్పారు. వాగులు, వంతెనలు దాటే ప్రయత్నం చేయొద్దని, మొక్కజొన్న పంట కోతను వాయిదా వేసుకోవాలని, రైతులు పంటలను జాగ్రత్తగా కాపాడుకోవాలని అన్నారు. పురాతన మట్టి మిద్దెల కింద నివాసం ఉండొద్దని సూచించారు.

News October 25, 2025

పోలీసుల అదుపులో శివశంకర్ స్నేహితుడు

image

కర్నూలు బస్సు ప్రమాదంలో శివశంకర్ స్నేహితుడు ఎర్రిస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తుగ్గలి మండలం రాంపల్లికి చెందిన ఎర్రిస్వామి ప్రమాదానికి ముందు శివశంకర్‌ బైక్‌‌ ఎక్కారు. వీరిద్దరూ పెట్రోల్ బంకులో ఉన్న <<18098159>>CC వీడియో<<>> బయటకొచ్చింది. బస్సు-బైక్ ఢీకొన్న ఘటనలో శివశంకర్, ఎర్రిస్వామి ఇద్దరూ ఎగిరి పడినట్లు తెలుస్తోంది. ఘటనలో శివశంకర్ మృతిచెందగా ఎర్రిస్వామి గాయాలతో బయటపడ్డారు.

News October 25, 2025

అతనెవరు.. తెలిస్తే చెప్పండి: కలెక్టర్

image

కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాద ఘటనలో మరణించిన గుర్తుతెలియని వ్యక్తిని గుర్తిస్తే కంట్రోల్ రూమ్ 08518 277305కు ఫోన్ చేసి తెలపాలని కలెక్టర్ డా.ఏ.సిరి పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన బస్సులో హైదరాబాద్ ఆరంఘర్ చౌరస్తాలో ఎక్కినట్లు తెలిసిందన్నారు. అతని పేరు ప్రయాణికుల జాబితాలో లేదని తెలిపారు. వయసు 50 ఏళ్లు ఉండవచ్చని, అతని వివరాలు తెలిస్తే తెలపాలని కోరారు.