News April 15, 2025
రాయవరం: కొడుకు మృతి.. తల్లడిల్లిన తల్లి హృదయం

తల్లిదండ్రులు కుమారుడి భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పదో తరగతి పరీక్షలు రాసిన కుమారుడి ఫలితం కోసం చూస్తున్నారు. అంతలోనే కొడుకు మరణ వార్తతో షాకయ్యారు. సోమేశ్వరం పరధిలో జరిగిన ప్రమాదంలో సందీప్ మృతి చెందిన విషయం తెలిసిందే. కుమారుడి మృతదేహం వద్ద తల్లి ఆర్తనాధాలు అక్కడ ఉన్నవారిని కలిచివేశాయి. ఒక్కగానొక్క కుమారుడు దూరం కావడంతో తల్లిదండ్రులు తల్లడిల్లారు.
Similar News
News April 23, 2025
కొమురవెల్లి: ఈతకు వెళ్లి వ్యక్తి మృతి

ఈతకు వెళ్లిన వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలో చోటుచేసుకుంది. గ్రామస్థుల వివరాలిలా.. మండలానికి చెందిన గొల్లపల్లి కనకయ్య(50) పెద్దబావిలో ఈతకు వెళ్లి మృతి చెందాడని తెలిపారు. మృతుడికి భార్య ముగ్గురు కుమారులు ఉన్నారు. విషయం తెలుసుకున్న కొమరవెల్లి ఎస్ఐ ఘటనా స్థలానికి చేరుకొని స్థానికుల సహాయంతో మృతదేహాన్ని వెలికి తీశారు. మృతికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 23, 2025
నేడే టెన్త్ ఫలితాలు.. ఇలా చేయండి

AP: ఇవాళ టెన్త్ పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి. ఉ.10 గంటలకు విద్యాశాఖ అధికారులు రిజల్ట్స్‌ను ప్రకటిస్తారు. ఓపెన్ స్కూల్ టెన్త్, ఓపెన్ స్కూల్ ఇంటర్ ఫలితాలను కూడా రిలీజ్ చేస్తారు. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగిన పరీక్షలకు 6.19 లక్షల మంది హాజరయ్యారు. Way2News యాప్ ద్వారా సులభంగా ఫలితాలు తెలుసుకోవచ్చు. హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే క్షణాల్లో మార్కుల లిస్ట్ వస్తుంది.
News April 23, 2025
ANU: ఇంజినీరింగ్ మొదటి సెమిస్టర్ ఫలితాలు విడుదల

నాగార్జున వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన మొదటి సెమిస్టర్ 1/4 ఫలితాలను వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు మంగళవారం విడుదల చేశారు. ఎంబీఏ,ఇంటర్నేషనల్ బిజినెస్ స్టడీస్ రీవాల్యూయేషన్ ఫలితాలను కూడా విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. బీటెక్ 4/1, 4/4 సెమిస్టర్ల పరీక్ష ఫలితాలను బుధవారం విడుదల చేసేందుకు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఫలితాలు www.anu.ac.in లో అందుబాటులో ఉన్నాయన్నారు.