News April 15, 2025

రాయవరం: రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం

image

రాయవరం మండలం సోమేశ్వరానికి చెందిన దుడ్డు సందీప్ (16) సోమవారం దుర్మరణం చెందాడు. బైక్‌పై వెళ్తూ అదుపుతప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న లోడు వ్యానును బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడని ఎస్ఐ సురేశ్ బాబు తెలిపారు. పదో తరగతి పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సందీప్ మృతితో తల్లి నాగమణి, తండ్రి తాతారావు కన్నీటి పర్యంతమయ్యారు. దీనిపై కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు.

Similar News

News November 4, 2025

విశాఖలో ముమ్మరంగా ఏర్పాట్లు

image

ఈనెల 14,15వ తేదీల్లో జ‌ర‌గ‌నున్న ప్ర‌పంచస్థాయి భాగ‌స్వామ్య స‌ద‌స్సు ఏర్పాట్లను క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్ మంగళవారం పరిశీలించారు. ఏయూ ఇంజినీరింగ్ క‌ళాశాల‌ మైదానంలో జ‌రుగుతున్న ఏర్పాట్ల‌ను జేసీ మ‌యూర్ అశోక్‌తో క‌లిసి ప‌రిశీలించి పలు సూచ‌న‌లు చేశారు. ప్ర‌తిష్టాత్మ‌క కార్య‌క్ర‌మానికి దేశ, విదేశాల నుంచి 3వేల మంది హాజ‌ర‌వుతార‌న్నారు. ఎలాంటి సమస్యలు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.

News November 4, 2025

పాల్వంచ: ఈనెల 6న జాబ్ మేళా

image

నిరుద్యోగ యువత కోసం ఈనెల 6న పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి కొండపల్లి శ్రీరామ్ తెలిపారు. సేల్స్ కన్సల్టెంట్(Male) 13 పోస్టులకు గాను ఏదైనా డిగ్రీ, టూవీలర్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. సర్వీస్ అడ్వైజర్ 2 పోస్టులకు గాను డీజిల్ మెకానిక్/బీ.టెక్ మెకానిక్ పూర్తిచేసి 22-30 ఏళ్ల మధ్య గలవారు ఉదయం 10 గంటలకు అన్ని సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు.

News November 4, 2025

12 నెలల పాటు ChatGPT ఫ్రీ.. ఇలా చేయండి

image

ఓపెన్ ఏఐ కంపెనీ 12 నెలల పాటు ChatGPT సబ్‌స్క్రిప్షన్‌ను <<18129528>>ఫ్రీగా<<>> అందిస్తోంది. ఇందుకోసం ఇలా చేయండి.
*ChatGPT యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
*యాప్ ఓపెన్ చేయగానే పైన కనిపించే Try Go, Freeపై క్లిక్ చేయాలి
*ఆ తర్వాత Upgrade to Goపై క్లిక్ చేయగానే పేమెంట్ ఆప్షన్స్ కనిపిస్తాయి.
*రూ.2 డెబిట్ అయి వెంటనే క్రెడిట్ అవుతాయి.
NOTE: ప్లాన్ యాక్టివేట్ అయ్యాక ఆటో రెన్యువల్ క్యాన్సిల్ చేయడం మర్చిపోవద్దు.