News March 25, 2025
రాయికల్: అక్రమ ఆయుధం విక్రయ యత్నం.. పట్టుకున్న పోలీసులు

అక్రమ ఆయుధాన్ని విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు SI సుధీర్ రావు తెలిపారు. SI వివరాలిలా.. UP కి చెందిన పవన్, సునీల్ లు రాయికల్ (m) బషీర్ పల్లెలో ఉంటూ లేబర్ పని చేస్తూ బతుకుతున్నారు. వారు UP నుండి అక్రమంగా ఒక తపంచా తెచ్చారు. సునీల్ తపంచాను అమ్మమని పవన్‌కు ఇచ్చి వెళ్ళాడు. పవన్ రామాజీపేటలో నేడు అమ్మడానికి ప్రయత్నిస్తుండగా గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించగా తపంచా, లైన్ రౌండ్ పట్టుకొని సీజ్ చేశారు.
Similar News
News October 18, 2025
వివాహిత అదృశ్యం కేసు పై హైకోర్టు సీరియస్

తాడేపల్లిగూడెం (M) దండగర్రకు చెందిన వివాహిత మహిళ మంగాదేవి అదృశ్యం కేసు విచారణలో హైకోర్టు సీరియస్ అయింది. మహిళ తండ్రి బండారు ప్రకాశరావు 2017లో కోర్టును ఆశ్రయించడంతో ఆ కేసు శుక్రవారం విచారణకు వచ్చింది. వివాహిత భర్త బ్రహ్మాజీని ఐదేళ్ల తర్వాత విచారించడం పై హైకోర్టు న్యాయమూర్తి దేవానంద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసు పురోగతి తెలియజేయాలంటూ పోలీసులకు ఆదేశిస్తూ నాలుగు వారాలకు వాయిదా వేసింది.
News October 18, 2025
HYD: జిమ్‌లలో ‘మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్’ దుర్వినియోగంపై చర్యలు

సికింద్రాబాద్‌లోని నామాలగుండులో అక్రమంగా నిల్వచేసి విక్రయించిన ‘మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్’ నిల్వలను డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎం.నరేశ్ అనే మెడికల్ వ్యాపారి నుంచి గుండె ఉద్దీపన మందులు-టెర్మిన్ ఇంజెక్షన్లు, టెర్మివా ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. బాడీబిల్డింగ్‌లో దుర్వినియోగం కోసం ఈ మందులను జిమ్‌కు వెళ్లేవారికి చట్టవిరుద్ధంగా విక్రయిస్తున్నారు.
News October 18, 2025
యమ దీపం ఎలా పెట్టాలంటే..?

ధన త్రయోదశి నాడు వెలిగించే యమ దీపంలో నాలుగు వత్తులు, నాలుగు ముఖాలుగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. ‘ఈ దీపం కోసం.. నువ్వుల నూనె/ ఆవ నూనెను ఉపయోగించాలి. దీపాన్ని ఇంటి బయట దక్షిణ దిశలో ఉంచాలి. కుటుంబ సభ్యులందరూ దీర్ఘాయుష్షుతో, కష్టాల నుంచి విముక్తి పొందాలని యమధర్మరాజును ప్రార్థించాలి. ఈ దీపదానం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు నిలిచి, అకాల మరణ భయం తొలగిపోతుంది’ అని అంటున్నారు.