News February 5, 2025
రాయికల్: ఉరేసుకుని యువకుడి సూసైడ్

ఉరేసుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణ కేంద్రంలో జరిగింది. స్థానికుల పక్రారం.. ఇందిరానగర్ కాలనీకి చెందిన గాజుల మనోజ్ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. ఈరోజు యువకుడు చెట్టుకి ఉరేసుకుని కనిపించాడు. యువకుడి మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కాగా, ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 23, 2026
విశాఖలో ట్రాఫిక్ టెన్షన్.. విద్యార్థులు విలవిల

విశాఖపట్నంలో భారీగా నిలిచిపోతున్న ట్రాఫిక్ ఇంటర్మీడియట్ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకోలేమోనన్న టెన్షన్‌తో విద్యార్థులు సతమతమవుతున్నారు. రోడ్లపై ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో పరీక్షా సమయం మించిపోతుందని భయపడుతున్నారు. ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా విద్యార్థులు కాస్త ముందుగానే బయలుదేరాలని అధికారులు సూచిస్తున్నారు.
News February 23, 2026
MBNR: ‘బీసీలు రాజ్యాధికారం కోసం ఉద్యమించాలి’

బీసీలు రాజ్యాధికారం కోసం భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ ఉద్యమించాలని ఇంటలెక్చువల్ ఫోరం ఛైర్మన్ చిరంజీవులు అన్నారు. MBNRలో ఏర్పాటు చేసిన కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినాక బీసీల ఆత్మగౌరవం దెబ్బతీస్తూ అణచివేయడానికి ఎన్నో ఎత్తుగడలు వేస్తున్నారన్నారు. బీసీలు ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి చేరుకున్నప్పుడే రాజ్యాధికారం దక్కుతుందని ఆయన అన్నారు.
News February 23, 2026
కృష్ణా: అపరాల కోతలకు కూలీల కొరత

జిల్లాలో రెండో పంటగా సాగుచేసిన అపరాల పంట కోతల దశకు చేరుకోవడంతో రైతులకు కూలీల కొరత తీవ్రంగా ఎదురవుతోంది. స్థానికంగా వ్యవసాయ కూలీలు అందుబాటులో లేకపోవడంతో రైతులు ఇతర ప్రాంతాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం, ఒడిశా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి కూలీలు పెద్ద సంఖ్యలో జిల్లాకు తరలివస్తున్నారు. ప్రస్తుతం అపరాల పంట కోతలు వేగంగా సాగుతున్న నేపథ్యంలో కూలీలకు డిమాండ్ ఏర్పడింది.


