News February 5, 2025
రాయికల్: ఉరేసుకుని యువకుడి సూసైడ్

ఉరేసుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణ కేంద్రంలో జరిగింది. స్థానికుల పక్రారం.. ఇందిరానగర్ కాలనీకి చెందిన గాజుల మనోజ్ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. ఈరోజు యువకుడు చెట్టుకి ఉరేసుకుని కనిపించాడు. యువకుడి మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కాగా, ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 7, 2025
చిత్తూరు: 66 ఉద్యోగాలకు దరఖాస్తులు

ఉమ్మడి చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో ఔట్సోర్సింగ్ ప్రాతిపదికగా ఎస్వీ మెడికల్ కళాశాల, రుయా హాస్పిటల్, పద్మావతి నర్సింగ్ కాలేజ్, గవర్నమెంట్ మెటర్నరీ హాస్పిటల్లలో వివిధ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. 19 విభాగాలలో .. 66 ఖాళీలు ఉన్నట్లు సూచించారు. అర్హత, ఇతర వివరాలకు https://tirupati.ap.gov.in/ వెబ్ సైట్ చూడగలరు. దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్రవరి 22.
News February 7, 2025
దొంగలను చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు

ఏలూరులోని నగల దుకాణంలో భారీ చోరీకి పాల్పడిన<<15384948>> దొంగలను<<>> పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితులు అంతర్రాష్ట్ర ముఠాగా గుర్తించిన పోలీసులు వారు ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్నట్లు తెలిసి అక్కడకు వెళ్లారు. వారి గ్రామాల సమీపంలో మాటు వేసి పట్టుకున్నారు. నిందితులపై ఏలూరు పరిధిలో దాదాపు 10 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి నుంచి 469 గ్రాముల బంగారు ఆభరణాలు, 41 కేజీల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.
News February 7, 2025
UPDATE: గజ్వేల్ మృతులు గోదావరిఖని వాసులు

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని రాజీవ్ రహాదారిపై జరిగిన <<15384831>>రోడ్డు ప్రమాదం<<>>లో మృతులు గోదావరిఖని వాసులుగా పోలీసులు గుర్తించారు. గోదావరిఖనికి చెందిన బాణేశ్(28), లింగం(48) మృతిచెందారు. మహేశ్(44) పరిస్థితి విషమంగా ఉండడంతో గజ్వేల్ వైద్యులు హైదరాబాద్‌కు రిఫర్ చేశారు. కారు డ్రైవర్ కుందేళ్ల ప్రణయ్ సాగర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.