News May 19, 2024
రాయితీపై పంపిణీకి సిద్ధంగా విత్తనాలు

NLR: ఖరీఫ్ సీజన్లో భాగంగా బోర్ల కింద పంట సాగు చేసే రైతులకు సబ్సిడీపై పంపిణీ చేసేందుకు 4316 క్వింటాళ్ల వరి విత్తనాలు సిద్ధం చేసినట్లు వ్యవసాయ శాఖ నెల్లూరు జేడీ సత్యవాణి తెలిపారు. కిలోకి రూ.5 చొప్పున సబ్సిడీ ఇస్తున్నామన్నారు. మినుము, పెసర, కందుల విత్తనాలను కూడా 50 శాతం సబ్సిడీపై అందజేయనున్నట్లు వెల్లడించారు. రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులు, పచ్చిరొట్ట విత్తనాలూ అందుబాటులో ఉన్నాయన్నారు.
Similar News
News November 7, 2025
నెల్లూరు: లోకేష్ వార్నింగ్ ఎవరికో..?

దగదర్తిలో నారా లోకేశ్ ఇచ్చిన వార్నింగ్ కలకలం రేపుతోంది. మాలేపాటి కుటుంబ సభ్యులను పరామర్శించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. కించపరుస్తూ పోస్టులు పెట్టడాన్ని గమనించాం. దీని వెనకాల ఎవరున్నా చాలా కఠినమైన నిర్ణయం తీసుకుంటాం.. యాక్షన్లో చూపిస్తాం’ అన్నారు. మరి ఇది ఎవరిని ఉద్దేశించి అన్నారనేది టీడీపీలో కాక రేపుతోంది.
News November 6, 2025
రేపు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు రాక

మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శుక్రవారం సాయంత్రం 6 గంటలకు నెల్లూరుకు చేరుకుంటారు. రాత్రి 7 గంటలకు నెల్లూరు VRC మైదానంలో నిర్వహిస్తున్న కార్తీక లక్ష దీపోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొంటారు. ఈనెల 8వ తేదీ శనివారం ఉదయం 11 గంటలకు డీఆర్సీ సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 4.15 గంటలకు కొండ బిట్రగుంటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని మంత్రి దర్శించుకుంటారు.
News November 6, 2025
కలగానే..ఉదయగిరి రెవెన్యూ డివిజన్!

నెల్లూరు జిల్లాలో రాజకీయ ఉద్దండులకు పేరుగా ఉన్న ఉదయగిరి నియోజకవర్గం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కలగా మారుతోంది. ఇక్కడున్న 8 మండలాల్లో నాలుగింటిని కావలిలో కలిపేలా మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదన ఉండడంతో ఆ ప్రాంతవాసులు పెదవి విరుస్తున్నారు. మరోవైపు గూడూరును నెల్లూరుజిల్లాలో కలిపేందుకు మంత్రి వర్గ ఉపసంఘం సానుకూలతను కల్పించడం కొంత మేరా ఆశాజనకంగా మారుతుంది. అయితే దీనిపై గెజిట్ వచ్చే వరకు వేచి చూడకు తప్పదు.


