News April 3, 2024

రాయితీపై విత్తనాలు రైతులకు భారం తగ్గినట్లే

image

ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులపై విత్తన భారాన్ని తగ్గించేందుకు
ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పూర్వం మాదిరి రానున్న వానాకాలం నుంచి రాయితీపై విత్తనాలను రైతులకు సరఫరా చేసే అంశంపై వ్యవసాయ శాఖ ప్రతిపాదనలను ఇప్పటికే సమర్పించింది. రైతులకు విత్తన భారం నుంచి వెసలుబాటు కల్పించేలా పూర్వ విధానాన్ని అమలు చేయడమే కాక మరికొన్ని ప్రయోజనాలను అమలు వర్తింపచేసేందుకు తాజాగా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.

Similar News

News April 11, 2026

ఏఐ సాంకేతికతతో ఆదాయ వృద్ధి: భట్టి విక్రమార్క

image

మైనింగ్, రవాణా శాఖల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేస్తూ ఆదాయాన్ని పెంచేందుకు ‘ఏఐ’ సాంకేతికతను వినియోగించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. సచివాలయంలో జరిగిన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమన్నారు. గత 3 నెలల్లో జీఎస్టీ ఆదాయం 15 శాతం పెరగడంపై హర్షం వ్యక్తం చేశారు.

News April 11, 2026

నెలాఖరుకు 10 వేల ఇందిరమ్మ ఇళ్లు సిద్ధం చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో ఈ నెలాఖరుకు 10 వేల ఇందిరమ్మ ఇళ్లను గృహప్రవేశాలకు సిద్ధం చేయాలని కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ.. ఏప్రిల్ 30 నాటికి లక్ష్యాన్ని చేరుకునేలా వారాల వారీ ప్రణాళికతో పనులు పూర్తి చేయాలన్నారు. లబ్ధిదారులకు అవసరమైన సహకారం అందిస్తూ, పెండింగ్‌లో ఉన్న నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. పనుల్లో జాప్యం వహించవద్దని స్పష్టం చేశారు.