News March 22, 2025
రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి: జనగామ కలెక్టర్

జనగామ జిల్లాలో లే అవుట్ క్రమబద్ధీకరణ పథకం(ఎల్ఆర్ఎస్) కోసం దరఖాస్తు చేసుకున్న వారు రుసుము చెల్లించి.. రాయితీని పొందుతూ ప్లాట్లను క్రమబద్ధీకరణ చేసుకునేందుకు చొరవ చూపుతున్నారని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణకు రుసుము చెల్లించిన దరఖాస్తు దారులకు 25 శాతం రాయితీనిస్తూ, వెంటవెంటనే భూమి క్రమబద్ధీకరణ చేస్తున్నారన్నారు.
Similar News
News October 18, 2025
బ్రిటన్లో ‘ఆధార్’ తరహా వ్యవస్థ?

ఆధార్ కార్డు తరహా వ్యవస్థను UKలో తీసుకురావాలని ఆ దేశ PM స్టార్మర్ భావిస్తున్నారు. తమ డిజిటల్ ఐడెంటిటీ ప్రోగ్రామ్ ‘బ్రిట్ కార్డ్’కు ఆధార్ను ప్రేరణగా తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే భారత్లో మాదిరి సంక్షేమం, సర్వీసుల కోసం కాకుండా ఇల్లీగల్ మైగ్రెంట్ వర్కర్ల కట్టడికి ఈ వ్యవస్థను వాడుకోనున్నట్లు సమాచారం. తన ముంబై పర్యటన సందర్భంగా ఆధార్ రూపకల్పనలో కీలకంగా వ్యవహరించిన వారితో స్టార్మర్ భేటీ అయ్యారు.
News October 18, 2025
ములుగు: మేము లొంగిపోతాం: ‘మావో’ లేఖ

అగ్రనాయకుల లొంగుబాట్లతో అడవులు ఖాళీ అవుతున్నాయి. మొన్న మల్లోజుల వేణుగోపాల్ టీం, నిన్న తక్కళ్లపల్లి వాసుదేవరావు@ ఆశన్న టీం లొంగిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఛత్తీస్గఢ్లోని గరియాబంద్ జిల్లా ఉదంతి ఏరియా కమిటీ కార్యదర్శి సునీల్ ఓ ప్రకటన విడుదల చేశారు. తాము సైతం లొంగిపోనున్నట్లు లేఖలో వెల్లడించారు. నేటి పరిస్థితుల్లో ఆయుధాలతో యుద్ధం చేయలేమని, సీసీ కమిటీ నిర్ణయం తీసుకోవడంలో విఫలమైందన్నారు.
News October 18, 2025
ములుగు: రూ.500కు ప్లాట్.. ట్రెండింగ్లో లక్కీ డ్రా స్కీమ్స్..!

ఇండ్లు, ఇంటి స్థలాల అమ్మకంలో ఇప్పుడు ట్రెండ్ మారింది. ఆకర్షనీయమైన లక్కీ డ్రా పేరుతో సరికొత్త విధానం పాటిస్తున్నారు. రూ.500 నుంచి రూ.600కే ప్లాటు గెలుచుకోండి.. అంటూ టోకెన్లు అమ్ముతున్నారు. ఇప్పుడు ములుగు జిల్లాలో ఈ తరహా లక్కీ డ్రా విధానం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా మంది యజమానులు తమ ఇంటి స్థలాలను డ్రా పద్ధతిలో అమ్ముకునేందుకు ముందుకు వస్తుండటం విశేషం.