News April 3, 2025
రాయితీ ఈ నెల వరకు: కలెక్టర్ హనుమంతరావు

లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్ )లో 25 శాతం రాయితీని ఈ నెల వరకు కొనసాగిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్ హనుమంత రావు ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Similar News
News December 4, 2025
విశాఖ: క్రికెటర్ కరుణ కుమారికి ఘన సత్కారం

అంధుల మహిళా టీ20 వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన విశాఖ బాలికల అంధుల రెసిడెన్షియల్ విద్యార్థిని కరుణ కుమారిని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఘనంగా సత్కరించారు. ప్రపంచ కప్‌కు సెలెక్ట్ అయిన తరువాత ప్రాక్టీస్‌కు అనుగుణంగా కరుణకుమారికి ప్రత్యేకంగా రెండు క్రికెట్ కిట్లకు రూ.50వేలు ఇవ్వడం జరిగిందన్నారు. భారత జట్టు విజయంలో కీలక ప్రతిభ చూపిన ఆమెకు ప్రోత్సాహకంగా కలెక్టర్ రూ.లక్ష చెక్ అందజేశారు
News December 4, 2025
కామారెడ్డి: డీజీపీకి పూల మొక్కను అందజేసిన కలెక్టర్

డీజీపీ శివధర్ రెడ్డిని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కామారెడ్డిలో మర్యాద పూర్వకంగా కలసి పూల మొక్కను అందజేశారు. జిల్లాలో శాంతి భద్రతల వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు.
News December 4, 2025
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి: డిజిపి

గ్రామపంచాయతీ ఎన్నికలను నిస్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని డిజిపి శివధర్ రెడ్డి సూచించారు. గురువారం ఆదిలాబాద్‌లో ఉమ్మడి జిల్లాల ఎస్పీలతో సమావేశం నిర్వహించారు. గ్రామాలను సందర్శిస్తూ ప్రజలకు ఎన్నికలపై అవగాహన కల్పించాలన్నారు. క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో బందోబస్తు పటిష్ఠంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. శాంతి భద్రతల, మతపరమైన సమస్యల తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు.


