News January 29, 2025
రావికమతం: వరినూర్పు యంత్రం పడి ఇద్దరి మృతి

రావికమతం ప్రధాన రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మాడుగుల మండలం వమ్మలి గ్రామానికి చెందిన వరినూర్పుల వాహనం మాకవరపాలెం వెళ్లింది. మంగళవారం రాత్రి తిరిగి వస్తూండగా రావికమతం మెయిన్ రోడ్డు మలుపు వద్ద ట్రాక్టర్ వెనుక కట్టిన యంత్రం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మాడుగుల(M) వమ్మలికి చెందిన జే.గణేశ్ (65), జే.నాయుడు (50) మృతి చెందారు. ఎస్ఐ రఘువర్మ ఘటనాస్థలికి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News January 1, 2026
ఖమ్మం: ఐదేళ్లుగా అసంపూర్తిగానే అగ్రహారం అండర్ బ్రిడ్జి!

ఖమ్మం-బోనకల్ రహదారిలోని అగ్రహారం వద్ద రూ.18.50 కోట్లతో చేపట్టిన అండర్ బ్రిడ్జి (RUB) పనులు ఐదేళ్లుగా నత్తనడకన సాగుతున్నాయి. 2021లో శంకుస్థాపన చేసినా, కోవిడ్, విజయవాడ-కాజీపేట మూడో రైల్వే లైన్ అలైన్‌మెంట్ మార్పు వల్ల పనులు నిలిచిపోయాయి. దీనివల్ల వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి వంతెన పనులను త్వరగా పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
News January 1, 2026
WGL: సానుకూల ఆలోచనలతో ముందుకు సాగాలి: కలెక్టర్

వరంగల్ జిల్లా ప్రజలకు కలెక్టర్ డాక్టర్ సత్య శారద న్యూ ఇయర్ విషెస్ తెలిపారు. కొత్త సంవత్సరంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, శాంతి సమృద్ధి చేకూరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కేవలం వ్యక్తిగత అభివృద్ధి మాత్రమే కాకుండా, సమాజ శ్రేయస్సును కూడా ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. ఆరోగ్యవంతమైన సమాజ స్థాపనకు ప్రతి పౌరుడు కృషి చేయాలని, సానుకూల ఆలోచనలు విజయానికి తొలిమెట్టు అని ఆమె ఉద్ఘాటించారు.
News January 1, 2026
NLG: మున్సిపల్ ఎన్నికలు.. ఆ రోజు తుది ఓటర్ జాబితా!

ముసాయిదా ఓటరు జాబితా ప్రకటన, అభ్యంతరాల స్వీకరణ అనంతరం ఈనెల 5వ తేదీన నల్గొండ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లోని మున్సిపాలిటీల్లో రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించనున్నారు. జిల్లా స్థాయిలో జనవరి 6వ తేదీన ఆయా పార్టీల నేతలతో సమావేశాలు నిర్వహించి వారి సూచనలు తీసుకుని అవసరమైతే మార్పులు, చేర్పులు చేపట్టనున్నారు. జనవరి 10న మున్సిపల్ తుది ఓటరు జాబితా ప్రకటించనున్నారు.


