News April 14, 2025

రావి ఆకుపై భారత రాజ్యాంగ నిర్మాత చిత్రం

image

అంబేద్కర్ జయంతి సందర్భంగా నారాయణఖేడ్ లీఫ్ ఆర్టిస్టు గుండు శివకుమార్ రావి ఆకుపై అంబేద్కర్ చిత్రం రూపొందించాడు. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఆయన ఆకాంక్షించిన విధంగా భారతదేశాన్ని శక్తివంతంగా చేసేందుకు కృషి చేయాలని ఆయన కోరారు.

Similar News

News October 20, 2025

ఇదేం ఆట.. టీమ్ ఇండియాపై ఫ్యాన్స్ ఫైర్

image

వరల్డ్ కప్-2025: ఇంగ్లండ్‌పై భారత మహిళల టీమ్ చేజేతులా మ్యాచ్ ఓడిపోయిందని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. 30 బంతుల్లో 36 రన్స్ చేయాల్సి ఉండగా 6 వికెట్లు చేతిలో ఉన్నాయని, అయినా గెలవలేకపోయిందని మండిపడుతున్నారు. ఇలాంటి ఆటతీరుతో భారత్ WC నెగ్గడం కష్టమేనని విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా గత 3 మ్యాచుల్లో భారత్ పరాజయం పాలైంది. దీంతో సెమీస్ అవకాశాలు సన్నగిల్లాయి. అటు AUS, దక్షిణాఫ్రికా, ENG సెమీస్ చేరాయి.

News October 20, 2025

చంద్రబాబూ.. మీది ఏ రాక్షస జాతి: YCP

image

AP: 2019-24 మధ్య రాష్ట్రాన్ని ఒక రాక్షసుడు పట్టిపీడించాడని CM చంద్రబాబు చేసిన <<18052970>>వ్యాఖ్యలపై<<>> YCP మండిపడింది. ‘చంద్రబాబు గారూ.. మీరు ఏ రకం రాక్షస జాతికి చెందిన వారు. ఎందుకంటే వరుసగా రెండుసార్లు 2004, 2009లో ప్రజలు మిమ్మల్ని చిత్తుచిత్తుగా ఓడించారు. 2019లోనూ మట్టికరిపించారు. అసలు మీరు CM పీఠంలోకి వచ్చిందే.. NTR గారిని వెనక నుంచి పొడిచి. ఇది ఏ రాక్షసజాతి లక్షణం అంటారు’ అని ట్వీట్ చేసింది.

News October 20, 2025

తొగుట: కస్తూర్బా పాఠశాల.. కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

image

తొగుటలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కె.హైమావతి ఆకస్మికంగా సందర్శించారు. రాత్రివేళల్లో విద్యార్థులకు అందించే భోజనం నాణ్యతను ఆమె పరిశీలించారు. వంటగదికి వెళ్లి మెనూ ప్రకారం బీరకాయ కూర, సాంబారు పెడుతున్నారా అని ఆరా తీశారు. అటెండెన్స్ రిజిస్టర్ తనిఖీ చేస్తూ, రాత్రి విధులు నిర్వహించే అధ్యాపకులు సక్రమంగా బాధ్యతలు నిర్వర్తించాలని ఆదేశించారు.