News April 14, 2025
రావి ఆకుపై భారత రాజ్యాంగ నిర్మాత చిత్రం

అంబేద్కర్ జయంతి సందర్భంగా నారాయణఖేడ్ లీఫ్ ఆర్టిస్టు గుండు శివకుమార్ రావి ఆకుపై అంబేద్కర్ చిత్రం రూపొందించాడు. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఆయన ఆకాంక్షించిన విధంగా భారతదేశాన్ని శక్తివంతంగా చేసేందుకు కృషి చేయాలని ఆయన కోరారు.
Similar News
News April 17, 2025
అచ్చంపేట: ‘వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి’

అచ్చంపేట పట్టణంలో గురువారం సీపీఎం జిల్లా కార్యదర్శి వి.పర్వతాలు మాట్లాడారు. జిల్లాలోని ప్రతి మండలంలో ప్రభుత్వం వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేస్తోందని అన్నారు. వడగళ్ల వానకు దెబ్బతిన్న పంటలకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు పాల్గొన్నారు.
News April 17, 2025
అనకాపల్లి: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై కలెక్టర్ సమీక్ష

అనకాపల్లి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో గురువారం అట్రాసిటీ కేసుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరిగేలా దర్యాప్తులో పూర్తి వివరాలు సేకరించి సకాలంలో ఛార్జిషీట్ దాఖలు చేయాలన్నారు. ఎస్పీ తుహీన్ సిన్హా, ఆర్డీవో సత్యనారాయణ రావు పాల్గొన్నారు.
News April 17, 2025
నిడదవోలు: ప్రజలకు ఆర్టీసీ శుభవార్త

నిడదవోలు డిపో నుంచి హైదరాబాద్‌కి RTC నూతన సర్వీస్ ప్రారంభిస్తున్నట్లు అధికారులు గురువారం తెలిపారు. చాగల్లు- పంగిడి -దేవరపల్లి – జంగారెడ్డిగూడెం- ఖమ్మం మార్గంలో ఈ బస్సు నడుపుతున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ కే.వెంకటేశ్వర్లు అన్నారు. రేపు సాయంత్రం 4:30 నిమిషాలకు మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా ప్రారంభించినట్లు నిడదవోలు ప్రాంత ప్రజలు సర్వీస్‌ని వినియోగించుకోవాలని ఆర్టీసీ అధికారులు తెలిపారు.