News January 29, 2025
రావి ఆకులపై పద్మ అవార్డు గ్రహీత చిత్రాలు

నారాయణఖేడ్‌కు చెందిన లీఫ్ ఆర్టిస్టు గుండు శివకుమార్ పద్మ అవార్డు గ్రహీతలకు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణకు చెందిన ప్రముఖ ప్రఖ్యాత జీర్ణకోశ వ్యాధి నిపుణులు డా.నాగేశ్వర్ రెడ్డి, చలనచిత్ర నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు పద్మ విభూషణ్ రాగా, తెలంగాణకు చెందిన మాదిగ రిజర్వేషన్ ఉద్యమకారుడు మందకృష్ణ మాదిగకు పద్మ అవార్డు లభించగా వారి చిత్రాలను రావి ఆకులపై వేసి శివ శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News November 7, 2025
గచ్చిబౌలి: ఫుడ్ ప్రాసెసింగ్‌పై టెక్నికల్ యూనిట్ కాన్ఫరెన్స్

గచ్చిబౌలి ప్రాంతంలో ఫుడ్ ప్రాసెసింగ్ అంశంపై టెక్నికల్ యూనిట్ కాన్ఫరెన్స్ జరిగింది. చైనా, రష్యా సహా ఇతర దేశాలకు చెందిన పలువురు నిపుణులు ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంపై పెట్టుబడులు లాభసాటిగా ఉన్నాయని, రోజురోజుకు డిమాండ్ పెరుగుతున్నట్లుగా FPUD డైరెక్టర్ సింగనాద్ జూరీ తెలిపారు.
News November 7, 2025
వనపర్తి: ‘బీజీలు సమర్పించిన మిల్లులకే ధాన్యం కేటాయింపు’

ఖరీఫ్ 2025-26 సీజన్‌కు సంబంధించి బ్యాంకు గ్యారంటీలు (బీజీ) సమర్పించిన రైస్ మిల్లులకే ధాన్యం కేటాయించడం జరుగుతుందని అదనపు కలెక్టర్ ఖీమ్య నాయక్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో మిల్లర్లతో ఆయన సమావేశమయ్యారు. అర్హత సాధించిన 80 మిల్లుల్లో కేవలం 18 మిల్లులు మాత్రమే బీజీలు సమర్పించాయని, మిగతా అర్హతగల మిల్లులన్నీ వెంటనే బీజీలు సమర్పించాలని ఆదేశించారు.
News November 7, 2025
చర్చలు సఫలం.. రేపటి నుంచి కాలేజీలు రీఓపెన్

TG: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య చర్చలు సఫలమయ్యాయి. దీంతో రేపటి నుంచి ప్రైవేట్ కాలేజీలు తెరుచుకోనున్నాయి. రూ.900 కోట్ల నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కొన్ని రోజులుగా కాలేజీలు బంద్ పాటిస్తున్న సంగతి తెలిసిందే.


