News April 11, 2025

రావులపాలెంలో కిడ్నాప్ కలకలం.. కారణమిదే

image

ఓ లోడు విషయంలో రూ.15లక్షలు బాకీ వల్ల రావులపాలెనికి చెందిన రమేశ్ తండ్రి సుబ్బారావును కిడ్నాప్ చేశారు. రమేశ్ 4ఏళ్లుగా మహరాష్ట్రలోని సాంగ్లీకి చెందిన సంజుతో కలిసి వ్యాపారం చేస్తున్నాడు. సుబ్బారావు ద్రాక్ష తోటల కోనుగోలు కోసం తరచూ మహరాష్ట్ర వెళ్లేవాడు. రమేశ్, సంజు మధ్య వివాదం జరగడంతో సంజు మనుషులు రెక్కీ నిర్వహించి కిడ్నాప్ చేశారు. రమేశ్ ఫిర్యాదుతో ఆరుగురిపై కేసు నమోదు చేశామని ASI రమణారెడ్డి తెలిపారు.

Similar News

News April 19, 2026

NRPT: ప్రజలు గొలుసుకట్టు వ్యాపారాలకు దూరంగా ఉండాలి

image

ప్రజల సొమ్ము దోచుకునేందుకు సైబర్ నేరగాళ్లు రోజురోజుకు కొత్తకొత్త పోకడలతో ప్రజల బలహీనతలను పెట్టుబడిగా చేసుకునేందుకు కొత్త పంథాను ప్రయోగిస్తున్నారని వాటి మాయలో పడి ఆర్థికంగా నష్టపోవద్దని నారాయణపేట ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. మల్టీలెవల్ మార్కెటింగ్ పథకాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. సైబర్ మోసంలో ఆర్థికంగా నష్టపోతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పారు.

News April 19, 2026

రేపు చంద్రబాబు బర్త్‌డే.. CDP రిలీజ్ చేసిన లోకేశ్

image

AP: రేపు సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేశ్ CDP (కామన్ డిస్‌ప్లే పిక్చర్) రిలీజ్ చేశారు. అందులో ఐటీ కంపెనీలు, అన్న క్యాంటీన్లు, మహిళలకు ఉచిత బస్సు, అమరావతి, పేదలకు ఇళ్లు, పెన్షన్ల పంపిణీ, తల్లికి వందనం లాంటి పథకాల వివరాలను పొందుపర్చారు. అటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్న క్యాంటీన్లలో రేపు ఉచిత భోజనం కోసం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి రూ.76 లక్షల విరాళం అందించారు.

News April 19, 2026

నిర్మల్ డీసీసీలో మార్పులు

image

నిర్మల్ జిల్లా డీసీసీలో మార్పులు ప్రతిపాదించారు. డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు సవరించిన కార్యవర్గ జాబితాను సిద్ధం చేశారు. ధర్మ గౌడ్, రమేష్, మమ్మాయి రమేష్‌‌ను వైస్ ప్రెసిడెంట్లుగా, దాశరథి రాజేశ్వర్‌ను కోశాధికారిగా, డీసీసీ కార్యనిర్వాహక సభ్యుడిగా మజార్ ఖాన్ ప్రతిపాదించారు. పలు మండలాల నుంచి సెక్రటరీలు, ఎగ్జిక్యూటివ్ సభ్యులను ఎంపిక చేశారు. సామాజిక సమీకరణకు ప్రాధాన్యం ఇచ్చారు.