News January 26, 2025

రావులపెంట వాసికి విలేజ్ ఇన్నోవేషన్ అవార్డు 

image

రావులపెంటకి చెందిన కోట నవీన్ కుమార్ వ్యవసాయ డ్రోన్ స్ప్రేయర్ ఆవిష్కరణకు గాను విలేజ్ ఇన్నోవేషన్ అవార్డు-2025 గెలుచుకున్నారు. మాజీ సర్పంచ్ దొంతి రెడ్డి వెంకట్ రెడ్డి నవీన్‌ని సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ శ్రీరాంరెడ్డి, మాజీ ఉపసర్పంచ్ తరి సైదులు, ఉపాధ్యాయులు లక్ష్మణ్ నాయక్ పాల్గొన్నారు.

Similar News

News February 17, 2025

కట్టంగూర్: జేఈఈ ఫలితాల్లో 91.38 % సాధించిన సిరి

image

కట్టంగూర్ మండలం ఐటి పాముల గ్రామపంచాయతీ పరిధి గంగాదేవి గూడెంకి చెందిన కంబాలపల్లి సిరి ఇటీవలే విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాలలో 91.38% సాధించింది.  ఐటిపాముల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివిన సిరి ప్రస్తుతం నల్గొండలోని ఓ కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. సిరి 91.38% సాధించడం పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

News February 17, 2025

దేవరకొండ: మద్యం మత్తులో యువకుడిపై దాడి

image

మద్యం మత్తులో యువకుడిపై కత్తితో దాడి చేసిన ఘటన దేవరకొండలో జరిగింది. సీఐ నర్పింహులు ప్రకారం.. T.పాత్లావాత్‌తండాకు చెందిన శరత్ ఇంటి ముందు నుంచి ఓ యువకుడు రెండు, మూడు సార్లు నడుచుకుంటూ వెళ్లాడు. దీంతో మద్యం మత్తులో ఉన్న శరత్ ఇంటి చుట్టూ ఎందుకు తిరుగుతున్నావంటూ కోపంతో కత్తితో దాడి చేశాడు. గాయాలైన యువకుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. బాధితుడు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

News February 16, 2025

పెద్దగట్టు జాతరలో అర్ధరాత్రి కీలక ఘట్టం

image

యాదవుల కులదైవమైన ప్రసిద్ధిగాంచిన పెద్దగట్టు లింగమంతులస్వామి జాతర ఆదివారం నుంచి ప్రారంభమైంది. మేడారం తర్వాత రాష్ట్రంలో అతిపెద్ద జాతరగా పేరుగాంచిన గొల్లగట్టు జాతర సమ్మక్క-సారలమ్మ జాతరలాగే 2ఏళ్లకోసారి జరుగుతుంది. ఈ జాతరలో కీలక ఘట్టమైన దేవరపెట్టె(అందనపు చౌడమ్మ పెట్టె) తరలింపు కార్యక్రమాన్ని ఈరోజు అర్ధరాత్రి నిర్వహించనున్నారు. కాగా శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ జాతర గురించి అనేక కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి.

error: Content is protected !!