News February 4, 2025
రాష్ట్రంలోనే అతిచిన్న మండల పరిషత్‌గా అమీన్‌పూర్

రాష్ట్రంలోనే అతిచిన్న మండల పరిషత్‌గా అమీన్‌పూర్ నిలిచింది. రెండు గ్రామ పంచాయతీలతో మండల పరిషత్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మండలంలోని వడక్‌పల్లిలో 820 ఓట్లతో మూడు ఎంపీటీసీ, జానకంపేట 640 ఓట్లతో రెండు ఎంపీటీసీ స్థానాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా 6 పంచాయతీలను అమీన్‌పూర్ మున్సిపాలిటీలో విలీనం చేశారు.
Similar News
News December 1, 2025
దిత్వా ఎఫెక్ట్.. వరి కోత యంత్రాలకు పెరిగిన డిమాండ్

తెలుగు రాష్ట్రాల్లో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ తరుణంలో దిత్వా తుఫాన్ రావడంతో.. వరి పండిస్తున్న రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తుఫానుకు తమ పంట ఎక్కడ దెబ్బతింటుందో అని చాలా మంది రైతులు వరి కోత సమయం రాకముందే కోసేస్తున్నారు. దీంతో వరి కోత యంత్రాలకు డిమాండ్ పెరిగింది. ఇదే అదనుగా కోత యంత్రాల యజమానులు.. ఎకరా పంట కోయడానికి రూ.4వేలకు పైగా వసూలు చేస్తున్నట్లు రైతులు వాపోతున్నారు.
News December 1, 2025
నేవీ అధికారి భార్యను రైలు నుంచి తోసేసిన TTE!

యూపీలో నేవీ అధికారి భార్య మృతి కేసులో రైల్వే టీటీఈపై కేసు నమోదైంది. నవంబర్ 26న వైద్యం కోసం ఢిల్లీకి బయలుదేరిన ఆర్తి(30) పొరపాటున మరో ట్రైన్ ఎక్కారు. టికెట్ విషయమై ఆర్తికి TTEతో వివాదం తలెత్తగా లగేజ్‌తో పాటు ఆమెను బయటకు తోసేశాడని కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే చనిపోయిందన్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో ఘటనపై ప్రత్యక్ష సాక్షులను విచారిస్తున్నట్లు GRP అధికారులు తెలిపారు.
News December 1, 2025
రూ.73 లక్షలకు బంగారిగడ్డ సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం!

నల్గొండ జిల్లా చండూరు మండలం బంగారిగడ్డ సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. సర్పంచ్ అభ్యర్థిగా 11 మంది నామినేషన్ వేశారు. ఆ తర్వాత గ్రామంలోని కనకదుర్గ ఆలయ నిర్మాణం, గ్రామాభివృద్ధి కోసం ఏకగ్రీవం చేయాలని నిర్ణయించి వేలంపాట వేయడంతో రూ.73 లక్షలకు మహమ్మద్ సమీనా ఖాసీం అనే అభ్యర్థి దక్కించుకున్నట్లుగా తెలిసింది. ఏకగ్రీవం విషయమై అధికారుల నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.


