News April 25, 2024

రాష్ట్రంలోనే అత్యధికంగా విజయనగరం జిల్లాలో

image

ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. తుమ్మికాపల్లిలో బుధవారం 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇది రాష్ట్రంలోనే అత్యధికం. నేడు కూడా ఉమ్మడి జిల్లాలో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. విజయనగరంలో 23, పార్వతీపురం మన్యం జిల్లాలోని 12 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Similar News

News November 29, 2024

విశాఖ డెయిరీపై విచారణకు ప్రత్యేక హౌస్ కమిటీ

image

విశాఖ డెయిరీపై విచారణకు ప్రత్యేక హౌస్ కమిటీని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు నియమించారు. కమిటీ ఛైర్మన్‌గా జ్యోతుల నెహ్రూ, సభ్యులుగా బొండా ఉమామహేశ్వరరావు, వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాసరావు, గౌతు శిరీష, ఆర్‌విఎస్ కేకే.రంగారావు, దాట్ల సుబ్బరాజులను నియమించారు. సమగ్ర విచారణ జరిపి రెండు నెలల లోపు నివేదిక సమర్పించాలని స్పీకర్ ఆదేశించారు.

News November 29, 2024

మీ ప్రాంతంలో ధాన్యం సేకరణ ఎలా ఉంది?

image

విజయనగరం జిల్లా వ్యాప్తంగా వరికోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. పలు ప్రాంతాల్లో వరి నూర్పులు పూర్తి కాగా పండించిన పంటను ధాన్యం కోనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. ఈ ఏడాది జిల్లాలో 3.25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కోనుగోలు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకోగా.. ధాన్యం సేకరణకు రైతు భరోసా కేంద్రాలను 250 క్లస్టర్లుగా ఏర్పాటు చేశారు. మరి మీ ప్రాంతంలో ధాన్యం కొనుగోలు సేకరణ ఎలా ఉందో కామెంట్ చేయండి.

News November 29, 2024

విజయనగరం జిల్లాలో విషాదం

image

ఎస్.కోట మండలంలో 2 వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మహిళలు మృతిచెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఎస్.కోటకు చెందిన విశాలక్ష్మి (86) బుధవారం వంట చేస్తుండగా చీరకు నిప్పు అంటుకుంది. తీవ్రంగా గాయపడిన ఆమెను విశాఖ తరలించగా అక్కడ చికిత్సపొందుతూ గురువారం మృతిచెందారు. అదేవిధంగా వెంకటరమణ పేట గ్రామానికి చెందిన సన్నమ్మ మెట్ల నుంచి జారిపడగా మెరుగైన చికిత్స కోసం KGHకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతిచెందారు.