News June 20, 2024
రాష్ట్రంలోనే అత్యల్ప సిజేరియన్లు మేడ్చల్‌లోనే..!
తెలంగాణ రాష్ట్రంలోనే ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యల్పంగా సి-సెక్షన్స్ సిజేరియన్లు మేడ్చల్ జిల్లాలో జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. 51 శాతం నమోదైనట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి నెల రిపోర్ట్ విడుదల చేస్తూ.. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రిలో జరిగిన ప్రసవాల వివరాలను అధికారులు వెల్లడించారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో వికారాబాద్ జిల్లాలో ఏకంగా 86% కడుపు కోతలు జరిగాయని తెలిపారు.
Similar News
News September 14, 2024
HYD: CM రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ..!
✓చర్లపల్లి రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల నుంచి స్టేషన్ చేరుకునే అప్రోచ్ రోడ్లను అభివృద్ధి చేయాలి.
✓చర్లపల్లి పరిసర అటవీ శాఖ, పరిశ్రమల విభాగాల భూములు స్వాధీనం చేసుకోవాలి.
✓చర్లపల్లిలో పలు పరిశ్రమలను వేరే ప్రాంతానికి తరలించాలి.
✓మూసి డెవలప్మెంట్‌పై ఫోకస్ పెట్టి, బాధిత నిర్వాసితులకు భరోసా కల్పించాలి.
✓ఇంటింటికి చెత్త సేకరణ కోసం వీలైతే GIS, QR కోడ్ స్కానింగ్ సాంకేతికత ఉపయోగించండి.
News September 14, 2024
HYD: సెప్టెంబర్ 17న సెలవు.. ఆరోజు రావాల్సిందే!
గణేశ్ నిమజ్జనం సందర్భంగా సెప్టెంబర్ 17న మంగళవారం జంట నగరాలు HYD, సికింద్రాబాద్‌తో పాటు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఆ రోజున సెలవు ఇస్తుండటంతో నవంబర్ 9 రెండో శనివారం వర్కింగ్ డేగా ప్రకటించారు. అక్టోబర్‌లో దసరా సెలవులు ఉన్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
News September 14, 2024
HYDలో ట్రాఫిక్ ఆంక్షలు.. BIG ALERT
HYD సైబర్ టవర్స్ వద్ద సర్వీస్ రోడ్డు నిర్మిస్తుండటంతో SEP14 నుంచి 30 వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ✓మాదాపూర్ కల్లు దుకాణం నుంచి JNTU, ముసాపేట వెళ్లే వారు 100 ఫీట్ జంక్షన్, పర్వత్‌నగర్ నుంచి కైతలాపుర్ బ్రిడ్జి మీదుగా వెళ్లాలని పోలీసులు తెలిపారు.
✓సైబర్ టవర్స్ వంతెన కింద నుంచి N-గార్డెన్ హోటల్ వద్ద లెఫ్ట్ టర్న్- N-కన్వెన్షన్- జైన్‌ఎంక్లేవ్ రైట్‌టర్న్- యశోద హాస్పిటల్ వైపు వెళ్లాలి.