News December 2, 2024
రాష్ట్రంలోనే టాప్.. ఎన్టీఆర్ జిల్లాలో 19,865 మంది HIV రోగులు

అధికారిక గణాంకాల ప్రకారం రాష్ట్రంలో అత్యధికంగా HIV రోగులు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నారు. జిల్లాలో 19,865 మంది HIV రోగులుండగా, ఈ జాబితాలో 13,166 మంది రోగులతో కృష్ణా జిల్లా 12వ స్థానంలో ఉంది. కాగా HIV రోగులకు ప్రతి నెలా రూ.4,000 పింఛన్ ఇస్తున్నట్లు ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ(ఏపీ శాక్స్) అధికారులు తెలిపారు. మొత్తంగా రాష్ట్రంలో 42,924 మందికి ఈ పింఛన్ అందిస్తున్నామన్నారు.
Similar News
News February 14, 2025
వల్లభనేని వంశీ అరెస్ట్.. ‘నానీ’లు సైలెంట్

వల్లభనేని వంశీ అరెస్ట్‌ను ఖండించడంలో మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని సైలెంట్ అయ్యారు. వీరిద్దరు సైలెంట్ అవ్వడం పట్ల రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. గత YCP ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన కొడాలి, పేర్ని, జోగి రమేశ్‌తో పాటు వల్లభనేని వంశీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేసి విమర్శలు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఒకొక్కరిని టార్గెట్ చేస్తోంది. ఈ క్రమంలోనే వంశీ అరెస్ట్ అయ్యారు.
News February 14, 2025
కృష్ణా: నెక్స్ట్ అరెస్ట్ అయ్యేది వీరేనా.?

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. దీంతో అదే పార్టీకి చెందిన కొందరు వైసీపీ నాయకులపై కూడా కేసులో ఉన్నాయి. వీరిని కూడా ఏ క్షణమైనా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని గుడివాడ టీడీపీ కార్యాలయం దాడి కేసులో ఆయనే సూత్రధారుడని ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం పేర్ని నాని బియ్యం మాయం కేసులో బెయిల్‌పై ఉన్నారు.
News February 14, 2025
కృష్ణా: రీ సర్వే సందేహాల నివృత్తికి హెల్ప్ లైన్ నంబర్

జిల్లాలో భూముల రీ సర్వే పైలెట్ ప్రాజెక్టు అమలవుతున్న 23 గ్రామాలలో రైతులు సందేహాల నివృత్తి కోసం జిల్లా సర్వే కార్యాలయంలో ప్రత్యేకంగా హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేశారు. ఈ సర్వే మీద రైతులకు సందేహాలు, సమస్యలు ఉంటే ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5గంటల వరకు 9492271542 నంబర్‌ను సంప్రదించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.