News September 11, 2024
రాష్ట్రంలోనే మొదటి ర్యాంకు సాధించిన పాలమూరు వాసి

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్ యూనివర్సిటీ బీఎస్సీ డిప్లొమా అర్హత పరీక్షలో మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలం దేశాయిపల్లికి చెందిన డి.వేణు 92 మార్కులతో రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించారు. తల్లిదండ్రులు సరోజ,పెంటయ్య స్వగ్రామంలో వ్యవసాయం చేస్తూ జీవనం గడుపుతున్నారు. రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించడం పట్ల గ్రామస్థులు,మండల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News February 24, 2026
రేపు పీయూలో ‘వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్’

పాలమూరు విశ్వవిద్యాలయ పీజీ కళాశాలలో బుధవారం ఉదయం 10:30 గంటలకు ‘వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్’ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ బి.మధుసూదన్ రెడ్డి తెలిపారు. పీయూ పరిధిలోని డిగ్రీ, ఇంటర్ ఎన్ఎస్ఎస్ (NSS) వాలంటీర్లు పాల్గొనవచ్చని పేర్కొన్నారు. స్థానిక భాషతో పాటు ఇంగ్లీష్, హిందీలో ప్రావీణ్యం కనబరిచిన వారు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికవుతారని ఆయన వెల్లడించారు.
News February 24, 2026
జడ్చర్ల: గొల్లపల్లి చెరువులో మరో యువకుడి మృతదేహం లభ్యం!

జడ్చర్ల మండలం గొల్లపల్లి చెరువులో గల్లంతైన రెండో యువకుడు యాదగిరి మృతదేహాన్ని ఎస్డీఆర్ఎఫ్ (SDRF) బృందాలు మంగళవారం వెలికితీశాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ కమలాకర్ భద్రతను పర్యవేక్షించగా, ఎస్సై జయప్రసాద్ గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. దీంతో ఇద్దరు యువకుల గాలింపు ముగిసింది.
News February 24, 2026
MBNR: పోలీస్ స్పోర్ట్స్ మీట్లో సత్తా చాటిన జిల్లా క్రీడాకారులు!

తెలంగాణ రాష్ట్ర 4వ పోలీస్ స్పోర్ట్స్ మీట్లో మహబూబ్నగర్ జిల్లా పోలీసులు 13 పతకాలు సాధించి సత్తా చాటారు. ఇందులో 2 స్వర్ణ, 3 రజత, 8 కాంస్య పతకాలు ఉన్నాయి. విజేతలను జిల్లా ఎస్పీ డి.జానకి అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. జిల్లాకు కీర్తి తెచ్చిన క్రీడాకారుల ప్రతిభను ఆమె ప్రత్యేకంగా కొనియాడారు.


