News April 6, 2024
రాష్ట్రంలోనే 8వ స్థానంలో లక్షెట్టిపేట

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని లక్షెట్టిపేట రికార్డు స్థాయిలో 91.44 శాతం మున్సిపాలిటీ పన్నులు వసూలు చేసింది. రాష్ట్రంలోనే ఈ మున్సిపాలిటీ టాప్-8లో నిలిచింది. ఉమ్మడి జిల్లాలో లక్షెట్టిపేట మొదటిస్థానంలో ఉండగా, భైంసా 47.29 శాతంతో రాష్ట్రంలోనే అట్టడుగున ఉంది. మంచిర్యాల 68.45 శాతం, ఆదిలాబాద్ 64.23 శాతం, నిర్మల్ 53.24, బెల్లంపల్లి 50.79, ఖానాపూర్లో 49% మాత్రమే పన్ను వసూళ్లు అయ్యాయి.
Similar News
News September 16, 2025
ADB: మొదలై వెంటనే ముగిసిన ఓ తల్లి విషాద గాథ..!

సిరికొండ మండలం బీంపూర్కు చెందిన తోడసం ఏత్మ భాయి(20) ప్రసవం తర్వాత మృతి చెందడం విషాదాన్ని నింపింది. ఈనెల 12న పురిటి నొప్పులతో ఆమెను ఇంద్రవెల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, బాలుడికి జన్మనిచ్చింది. 14వ తేదీన డిశ్చార్జ్ అయ్యాక తీవ్రమైన తలనొప్పి రావడంతో 108లో రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
News September 16, 2025
ADB: OPEN స్కూల్ అడ్మిషన్లకు గడువు పొడిగింపు

టెన్త్, ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల కోసం గడువును పొడగించినట్లు జిల్లా విద్యాధికారి (డీఈఓ) ఖుష్బూ గుప్తా తెలిపారు. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈనెల 12వ తేదీ వరకు అవకాశం ఉండగా 18 వరకు పొడగించినట్లు పేర్కొన్నారు. అపరాధ రుసుంతో సెప్టెంబర్ 20వ తేదీ వరకు గడువు ఉందని వెల్లడించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు.
News September 15, 2025
40 ఫిర్యాదులను స్వీకరించిన ఆదిలాబాద్ ఎస్పీ

ఆదిలాబాద్ జిల్లా పోలీసులు ప్రజల రక్షణ భద్రతకు ఎల్లవేళలా ముందుంటారని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సోమవారం డీపీఓ ఆఫీస్లో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించారు. ప్రజల సమస్యల పట్ల బాధ్యతాయుతంగా స్పందించి వెంటనే ఎస్పీ సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలించారు. సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. 40 ఫిర్యాదులు వచ్చినట్లు చెప్పారు.