News October 1, 2024

రాష్ట్రంలో అసలు ఏం జరుగుతోంది..?: బొత్స

image

ఆంధ్ర రాష్ట్రంలో అసలేం జరుగుతోందో అర్థం కావడం లేదని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. మంగళవారం విశాఖ వైసీపీ ఆఫీసులో ఆయన విలేకరులతో మాట్లాడారు. నిత్యవసర వస్తువుల ధరల నియంత్రణపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. మద్యంపై దృష్టి పెట్టి పెద్ద స్థాయిలో ప్రచారం చేస్తోందని అన్నారు. ఆయనతో పాటు మాజీ మంత్రులు బూడి ముత్యాల నాయుడు, కారుమూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Similar News

News November 5, 2025

విశాఖ: శ్మశానం వద్ద ఉరి వేసుకుని యువకుడి మృతి

image

మధురవాడలోని చంద్రంపాలెం గ్రామంలో శ్మశానం వద్ద ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉరి వేసుకొని ఉన్న యువకుడి మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో పీఎంపాలెం పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుడు గేదెల ఫణి (18)గా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News November 5, 2025

విశాఖ: అంగన్వాడీ ఉద్యోగాలు.. 2 పోస్టులకు 22మంది

image

ఐసీడీఎస్ విశాఖ అర్బన్ పరిధిలో అంగన్వాడి వర్కర్, హెల్పర్ పోస్టులకు మంగళవారం ధ్రువపత్రాల పరిశీలన చేపట్టారు. 2 అంగన్వాడీ వర్కర్ పోస్టులకు 22 మంది, 21 హెల్పర్ పోస్టులకు 89 మంది దరఖాస్తు చేసుకున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు చేయాల్సిన దరఖాస్తు పరిశీలన 12 గంటలకు చేపట్టారు. చివరిరోజు కావడంతో ఎక్కువమంది ఒకేసారి చేరుకున్నారు. దీంతో కాస్త ఇబ్బందికర పరిస్థితి నెలకొంది.

News November 5, 2025

గాజువాక: ఉద్యోగాల పేరుతో రూ.లక్షలు కాజేశారు

image

గాజువాకలో భార్యాభర్తలిద్దరినీ ఉద్యోగాల పేరుతో మోసం చేసిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. చట్టివాణిపాలేనికి చెందిన అలేఖ్య నర్సింగ్ చదువుతుండగా.. భర్త వినాయకరావు బీటెక్ చదివాడు. ఇద్దరికీ ఉద్యోగాలు ఇప్పిస్తామని మల్కాపురానికి చెందిన మచ్చ సజిని, నారాయణ రూ.91 లక్షలు కొట్టేశారు. వీరికి శ్రీహరిపురానికి చెందిన సీరపు షణ్ముఖ ఆదిత్య కుమార్, సీరపు రాంప్రసాద్, సీరపు అనిత సహకరించారు.