News May 22, 2024
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తొలిసారి మన HYDలో..!

నాగోల్ నుంచి ఎయిర్పోర్ట్ మెట్రోపై అధికారులు గుడ్ న్యూస్ తెలిపారు. ప్రతిపాదిత ఎల్బీనగర్ జంక్షన్ స్టేషన్, కూడలికి కుడి వైపు వస్తుందని, దీన్ని ప్రస్తుత ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ వరకు విశాలమైన స్కై వాక్‌తో అనుసంధానం చేయనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా స్కై వాక్‌లోనే సమతలంగా ఉండే వాకలేటర్ ( దీని పై నిల్చుంటే చాలు అదే తీసుకెళుతుంది) ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News November 14, 2025
Jubilee Hills Counting: రౌండ్లు.. డివిజన్ల వివరాలు

రౌండ్.1: షేక్‌పేటలోని 42 బూత్‌లు
రౌండ్.2:షేక్‌పేట, ఎర్రగడ్డ, వెంగళరావునగర్-42బూత్‌లు
రౌండ్.3:ఎర్రగడ్డ, వెంగళరావునగర్, రహమత్‌నగర్-42బూత్‌లు
రౌండ్.4&5:రహమత్‌నగర్, వెంగళరావునగర్-84 బూత్‌లు
రౌండ్.6&7:వెంగళరావునగర్, యూసుఫ్‌గూడ, సోమాజిగూడ-84 బూత్‌లు
రౌండ్.8&9:సోమాజిగూడ, ఎర్రగడ్డ, బోరబండ-84 బూత్‌లు
రౌండ్.10: ఎర్రగడ్డలోని 29 బూత్‌ల లెక్కింపు జరగనుంది.
News November 14, 2025
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్న నవీన్ యాదవ్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలోని కౌంటింగ్ హాల్‌కు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ చేరుకున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత, లంకల దీపక్ రెడ్డి కౌంటింగ్ సెంటర్లో ఉన్నారు. మరికాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది. మరో రెండు గంటల్లోపు గెలుపు ఎవరిది? అనేది ఓ క్లారిటీ రానుందని టాక్.
News November 14, 2025
జూబ్లీహిల్స్: సుమారు 75 శాతం పోలింగ్ నమోదైన బూత్‌లు నాలుగే!

జూబ్లీహిల్స్ బైపోల్ పోలింగ్ మొత్తం 407 బూత్‌లల్లో జరిగింది. కాగా ఇందులో 20-30 శాతం పోలింగ్ నమోదైన కేంద్రం 1 కాగా 71 కేంద్రాల్లో 31-40%, 143 కేంద్రాల్లో 41-50%, 158 కేంద్రాల్లో 51-60%, 30 కేంద్రాల్లో 61-70%, 4కేంద్రాల్లో 71-75% పోలింగ్ నమోదైంది. అయితే 60 శాతం కంటే ఎక్కువ పోలింగ్ నమోదైన 34కేంద్రాల్లో రహమత్‌నగర్ 16, బోరబండ 13, షేక్‌పేట్ 2, ఎర్రగడ్డ 3 ఉన్నాయి. వీటిల్లో 18చోట్ల మహిళలే అధికంగా ఓటేశారు.


