News May 22, 2024

రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తొలిసారి మన HYDలో..!

image

నాగోల్ నుంచి ఎయిర్పోర్ట్ మెట్రో‌పై అధికారులు గుడ్ న్యూస్ తెలిపారు. ప్రతిపాదిత ఎల్బీనగర్ జంక్షన్ స్టేషన్, కూడలికి కుడి వైపు వస్తుందని, దీన్ని ప్రస్తుత ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ వరకు విశాలమైన స్కై వాక్‌తో అనుసంధానం చేయనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా స్కై వాక్‌‌లోనే సమతలంగా ఉండే వాకలేటర్ ( దీని పై నిల్చుంటే చాలు అదే తీసుకెళుతుంది) ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News October 2, 2024

HYD: ‘ద‌స‌రా సెల‌వుల్లో పాఠ‌శాల‌లు నిర్వ‌హిస్తే చ‌ర్య‌లు’

image

రాష్ట్రంలోని ప్ర‌భుత్వ‌, ప్రైవేటు పాఠ‌శాల‌ల‌కు ఈ నెల 14 వ‌ర‌కు ద‌స‌రా సెలవులు ఇస్తున్న‌ట్లు విద్యాశాఖ ప్ర‌క‌టించింది. 15వ తేదీన తిరిగి పాఠ‌శాల‌లు ప్రారంభం కానున్నాయి. విద్యాశాఖ ఆదేశాలు పాటించ‌కుండా ప్రత్యేక క్లాసెస్, ట్యూషన్లు వంటివి కార్పొరేట్, ప్రైవేటు స్కూల్స్ నిర్వ‌హిస్తే, అలాంటి పాఠ‌శాల‌ల‌పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని విద్యాశాఖ అధికారులు హెచ్చ‌రించారు.

News October 2, 2024

HYD: మూసీ ప్రజలు నిశ్చింతంగా ఉండండి: మధుయాష్కి

image

కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఇంటిని అక్రమంగా కూల్చదని దానికి నాది గ్యారెంటీ అని టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ ఛైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ అంటేనే పేదలకు ఇళ్లు ఇచ్చే ప్రభుత్వమని, ఎవరి ఇళ్లు కూలగొట్టదని పేర్కొన్నారు. ఇళ్ల పైకి ఒక్క గడ్డపార రాదని.. ఒక జేసీబీ కూడా రాకుండా చూసే బాధ్యత తమదని అన్నారు.

News October 2, 2024

HYD: పండుగల తేదీలు ఫిక్స్ చేసిన ‘శ్వాస్’

image

సనాతన ధర్మ వ్యాప్తికి, సమాజ శ్రేయస్సు దృష్ట్యా పండగలు విశేష పర్వదినాల తేదీలను సిద్ధం చేశారు. ప్రజలు ఏలాంటి గందరగోళానికి గురికాకుండా ఉండేందుకు రాబోయే ‘విశ్వావసు నామ సంవత్సరం-2025-26’లో పండుగల తేదీలను నిర్ణయించినట్లు శ్రీ వైష్ణవ ఆగమ సంప్రదాయ సేవా సమితి (శ్వాస్) ప్రకటించింది. నిర్ణయించిన పండగల తేదీలను రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు అందజేస్తామని శ్వాస్ తెలిపింది.