News August 30, 2024

‘రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి కొత్త పాలసీ రూపొందించాలి’

image

సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావుతో టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి కొత్త పాలసీ రూపొందించాలని ఇతర రాష్ట్రాల్లోని బెస్ట్ పాలసీలను అధ్యయనం చేయడంతో పాటు ఏకో, టెంపుల్ టూరిజం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని, హెల్త్ టూరిజం, జూపార్కు అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.

Similar News

News September 11, 2024

12,18 తేదీల్లో PHD అభ్యర్థులకు ఇంటర్వ్యూలు

image

MGU నిర్వహించిన PHD పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ప్రొఫెసర్ ఆకుల రవి మంగళవారం తెలిపారు. ఈనెల 12న బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, 18న కామర్స్ అభ్యర్థులకు ఇంటర్వ్యూలు ఉంటాయని, ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో పాటు, నెట్, సెట్ ఇతర అర్హత పత్రాలను తీసుకురావాలన్నారు. మిగిలిన సబ్జెక్టుల వారికి త్వరలో ప్రకటిస్తామన్నారు.

News September 11, 2024

శాలిగౌరారం: విషాదం.. ఆర్టీసీ కండక్టర్ మృతి

image

విధులు ముగించుకొని ఇంటికి చేరుకుంటుండగా ఆకస్మాత్తుగా రక్తపు వాంతులు చేసుకొని ఆర్టీసీ కండక్టర్ మరణించిన ఘటన నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం వల్లాల శివారులో జరిగింది. గ్రామానికి చెందిన వైద్యుల ప్రకాశ్(50) సూర్యాపేట ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తుండగా రక్తపువాంతులు చేసుకొని మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

News September 11, 2024

నాగారం: డి.కొత్తపల్లి ఎస్సారెస్పీ కాల్వ వద్ద దారుణ హత్య

image

సూర్యాపేట జిల్లా నాగారం మండలం డి.కొత్తపల్లి ఎస్సారెస్పీ కాలువ వద్ద ఓ వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు గొంతు కోసి చంపి పడేసిన ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తిని గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.