News August 1, 2024

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ: హరీశ్ రావు

image

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా ఖూనీ అయిపోయిందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. గురువారం సీఎం ఛాంబర్ ముందు నిరసన తెలుపుతున్న హరీశ్ రావుతోపాటు పార్టీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అసెంబ్లీలో ఒక మహిళకు అన్యాయం జరిగితే మైక్ ఇవ్వకుండా ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతున్నారని హరీశ్ మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలోనూ ఇన్ని ఆంక్షలు లేవని, రాష్ట్రం మొత్తం పోలీస్ రాజ్యంగా మారిపోయిందని మండిపడ్డారు.

Similar News

News September 30, 2024

కొండా సురేఖపై ట్రోల్స్.. ఖండించిన మంత్రి పొన్నం

image

మంత్రి కొండా సురేఖపై సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం శాశ్వతం కాదని బీఆర్ఎస్ నేతలు గుర్తించాలన్నారు. బాధ్యత గల ప్రతిపక్షాలు మహిళల పట్ల మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు. సోషల్ మీడియాలో రాజకీయ నాయకులపై విమర్శించదలుచుకుంటే ఓ హద్దు ఉండాలన్నారు. మహిళా మంత్రులను అవమాన పరిచే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడాన్ని ఖండించారు.

News September 30, 2024

నేటి నుంచి ఎమ్మెల్సీ ఓటు నమోదుకు అవకాశం: కలెక్టర్

image

ఉపాధ్యాయ, పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అర్హులైన వారు ఈనెల 30 నుంచి నవంబర్ 6వ తేదీ వరకు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి సోమవారం తెలిపారు. గతంలో ఓటు వేసిన వారు కూడా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఆన్ లైన్, ఏఈఆర్ఓ నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. పట్టభద్రుల ఓటర్లు ఫారం నెంబర్- 18, ఉపాధ్యాయ ఓటర్లు ఫారం నెంబర్- 19లో దరఖాస్తు చేయాలని తెలిపారు.

News September 30, 2024

ఉమ్మడి మెదక్ నామినేటెడ్ పోస్టుల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ దిశగా మెదక్ జిల్లా ఇంచార్జ్ మంత్రి కొండా సురేఖ ప్రయత్నాలు ఫలించాయి. మెదక్ జిల్లాలో నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయమై మంత్రి సురేఖ, మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి సీఎం రేవంత్ రెడ్డితో గంటకు పైగా చర్చలు జరిపారు. పలు సమీకరణాలపై సుదీర్ఘ చర్చ అనంతరం సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.