News August 31, 2024
రాష్ట్రంలో భారీ వర్షాలు.. అధికారులతో సీఎం సమీక్ష
రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలపై CM చంద్రబాబు సమీక్ష చేశారు. పలు జిల్లాల్లో, పలు పట్టణాల్లో భారీ వర్షాల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో పరిస్థితులపై సీఎం శనివారం ఉదయం అధికారులతో మాట్లాడారు. భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించాలన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు తగు సూచనలు చేయాలని, అవసరమైన సహాయక చర్యలకు ప్రభుత్వ సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
Similar News
News September 15, 2024
18న నరసరావుపేటలో జాబ్ మేళా
జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 18న నరసరావుపేటలోని కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా అభివృద్ధి సంస్థ అధికారి సంజీవరావు తెలిపారు. జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఆదేశాల మేరకు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా జాబ్ మేళా ఏర్పాటు చేశామని 1500 ఉద్యోగాలు ఉన్నాయన్నారు. అభ్యర్థులు తమ విద్యార్హత సర్టిఫికెట్లతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాలని తెలిపారు.
News September 15, 2024
యడ్లపాడు వద్ద రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి
యడ్లపాడు వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్ఐ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు జిల్లా నిడమర్రుకి చెందిన కృష్ణ (31), రవి కిషోర్ (25) అనే ఇద్దరు కారు టైరు పంక్చర్ అవ్వడంతో రోడ్డు మార్జిన్‌లో టైరు మారుస్తున్న సమయంలో గుర్తు తెలియని వాహనం వీరిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరొక వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు.
News September 15, 2024
నేడు పోలీస్ కస్టడీకి నందిగం సురేశ్
మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఇటీవల అరెస్ట్ అయిన బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను ఆదివారం మంగళగిరి రూరల్ పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు. మంగళగిరి కోర్టు 2 రోజులు పోలీసుల కస్టడీకి అనుమతించడంతో ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు నందిగం సురేశ్‌ను మంగళగిరి రూరల్ పోలీసులు ప్రశ్నించనున్నారు.