News June 4, 2024
రాష్ట్రంలో మెుదటి ఫలితం నిజామాబాద్‌దే..!

రాష్ట్రంలోని 17 లోక్ సభ నియోజకవర్గాల ఎన్నికల ఫలితాలు నేడు వెల్లడికానున్నాయి. తొలి ఫలితం మధ్యాహ్నం ఒంటి గంట వరకే వెలువడే అవకాశం ఉంది. తుది ఫలితం సాయంత్రం 6 గంటల వరకు వచ్చే అవకాశం ఉంది. కాగా తొలి ఫలితం నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో వెలువడనుంది. ఈ నియోజకవర్గంలో కేవలం 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. కాగా ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.
Similar News
News January 3, 2026
297 మంది తెలుగు యువతకు విముక్తి: ఎంపీ అరవింద్

నకిలీ ఉద్యోగాల పేరిట థాయిలాండ్, మయన్మార్‌లలో చిక్కుకున్న 297 మంది తెలుగు యువతను కేంద్ర ప్రభుత్వం సురక్షితంగా రక్షించింది. ఎంపీ అరవింద్ లోక్‌సభలో ఈ అంశాన్ని ప్రస్తావించగా విదేశాంగ శాఖ స్పందించింది. మొత్తం 2,545 మంది భారతీయులు అక్రమ రవాణాకు గురికాగా, రాయబార కార్యాలయాల చొరవతో ఇప్పటివరకు 2,390 మందిని రక్షించినట్లు కేంద్రం తెలిపింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన 297 మంది సురక్షితంగా విముక్తి పొందారు.
News January 3, 2026
నిజాంసాగర్ కాలువకు రూ.1,500 కోట్లు ఇవ్వాలి: ఆర్మూర్ ఎమ్మెల్యే

నిజాంసాగర్ కెనాల్ ఆధునీకరణకు రూ.1,500 కోట్లు కేటాయించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కోరారు. శనివారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. నిజాం కాలంలో నిర్మించిన ఈ కాలువ పూడికతో అధ్వానంగా మారిందన్నారు. మదనపల్లి నుంచి ఫత్తేపూర్ వరకు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రెండేళ్ల క్రితం కాలిపోయిన మోటార్లను ఇంతవరకు మార్చలేదని మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లా అభివృద్ధిపై ప్రభుత్వం కనికరించాలన్నారు.
News January 3, 2026
నిజామాబాద్: శాంతి భద్రతలపై పోలీసుల ఫోకస్

నిజామాబాద్ జిల్లా ప్రజలకు సీపీ సాయి చైతన్య కీలక ఆదేశాలు జారీ చేశారు. శాంతిభద్రతల దృష్ట్యా జనవరి 1 నుంచి 15 వరకు నిబంధనలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. ప్రజలకు అసౌకర్యం కలిగించేలా విగ్రహ ప్రతిష్ఠలు చేయకూడదన్నారు. రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు DJలు నిషేధించినట్లు చెప్పారు. బహిరంగ మద్యపానంపై కఠిన చర్యలు ఉంటాయని, డ్రోన్లు, భారీ సభలకు ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు.


