News July 18, 2024

రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం: గుడివాడ

image

APలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ ఆరోపించారు. గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు స్వేచ్ఛగా రోడ్లమీద తిరిగే పరిస్థితి లేదన్నారు. మరీ ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలు, నాయకులపై కూటమి శ్రేణులు చేస్తున్న దమనకాండ రోజురోజుకు మితిమీరిపోతుందన్నారు. దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలతో రాష్ట్రంలోని శాంతి భద్రతల పరిస్థితి దిగజారిపోయిందని అమర్నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు.

Similar News

News September 16, 2025

విశాఖ చేరుకున్న నిర్మలా సీతారామన్

image

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం రాత్రి విశాఖ చేరుకున్నారు. రేపు పలు కార్యక్రమాల్లో ఆమె పాల్గొననున్నారు. ఈనెల 22 నుంచి కొత్త జీఎస్టీ అమలు కానుంది. దీంతో అనేక వస్తువుల ధరలు తగ్గనున్నాయి. జీఎస్టీ సంస్కరణలపై అవగాహన కార్యక్రమంతో పాటు స్వస్థ్‌ నారీ-సశక్త్‌ పరివార్‌ అభియాన్‌లో ఆమె పాల్గొంటారు. సీఎం చంద్రబాబు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనున్నారు.

News September 16, 2025

గోపాలపట్నంలో దారుణ హత్య

image

గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధి ఎల్లపువానిపాలెం 89వ వార్డులో దారుణం జరిగింది. అలమండ నితీశ్ (23) అనే వ్యక్తి భీశెట్టి పరదేశి (75)పై బండరాయితో దాడి చేసి హత్య చేశాడు. అడ్డుకునే ప్రయత్నం చేసిన స్థానికులను కూడా బెదిరించాడు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సంఘటనా స్థలంలో క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News September 16, 2025

ప్రజలకు విశాఖ సిటీ పోలీసుల హెచ్చరిక

image

విశాఖపట్నం సిటీ పోలీసులు ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. లోన్ యాప్స్ వలలో పడి అనేక మంది వేధింపులకు గురవుతున్నారని పేర్కొన్నారు. డౌన్లోడ్ చేసిన వెంటనే వ్యక్తిగత సమాచారం దోచుకుని, ఫోటోలు మార్ఫింగ్ చేసి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని తెలిపారు. సైబర్ మోసాలకు గురవకుండా అప్రమత్తంగా ఉండాలి ఇలాంటి మోసాలు ఎదురైతే వెంటనే 1930కు కాల్ చేయాలని సూచించారు.