News July 18, 2024

రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి: జెడ్పీ ఛైర్మన్

image

రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైసీపీ శ్రేణులపై దాడులు పెరిగిపోయాయని జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. అధికారం శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలన్నారు. పాలన చేయమని మంచి మెజార్టీ ఇస్తే దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. వినుకొండలో జరిగిన హత్యతోపాటు, ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీపై దాడులకు తెగబడడం సరికాదన్నారు.

Similar News

News December 5, 2025

స్క్రబ్ టైఫస్‌పై ప్రజలకు అవగాహన కల్పించండి: కలెక్టర్

image

జిల్లాలో స్క్రబ్ టైఫస్‌పై ప్రజల్లో భయం అవసరం లేదని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. వైద్యశాఖ అధికారులు, సిబ్బందితో శుక్రవారం తన ఛాంబర్‌లో టెలీ కాన్ఫిరెన్స్ నిర్వహించారు. ఇది పూర్తిగా నయం అయ్యే వ్యాధని, లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. ప్రజలు భయపడకుండా గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.

News December 5, 2025

VZM: పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడు.. అంతలోనే ఆత్మహత్య.!

image

పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం విజయనగరంలోని దాసన్నపేటలో జరిగింది. కోరాడ వీరేంద్ర (25) సింహాచలంలో నేడు పెళ్లి జరగాల్సి ఉంది. ముహూర్తాలు లేకున్నా పెళ్లి చేసుకోవాలని ప్రేమించిన యువతి ఒత్తిడి చేయడమే ఆత్మహత్యకు ప్రాథమిక కారణంగా తెలుస్తోంది. పెళ్లి చేస్తామని తల్లిదండ్రులు చెప్పినా,వీరేంద్ర ఎందుకు ఇలా చేశాడో తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News December 5, 2025

విజయనగరం జిల్లాలో మాతృ, శిశు మరణాలు సంభ‌విస్తే చర్యలు: కలెక్టర్

image

జిల్లాలో ఎక్క‌డైనా మాతృ, శిశు మ‌ర‌ణాలు సంభ‌విస్తే స‌హించేది లేదని జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. కలెక్టరేట్‌లోని DRC సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. క్షేత్ర‌స్థాయిలో అత్యున్న‌త ప్ర‌భుత్వ యంత్రాగం ఉంద‌ని, ప్ర‌భుత్వం మంచి పోష‌కాహారాన్ని స‌ర‌ఫ‌రా చేస్తోంద‌ని, అయిన‌ప్ప‌టికీ అక్క‌డ‌క్క‌డా మాతృ, శిశు మ‌ర‌ణాలు సంభ‌వించ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. ఇక‌ముందు జ‌రిగితే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చరించారు.