News March 3, 2025
రాష్ట్రంలో 44 డీ-అడిక్షన్ కేంద్రాలు: హోం మంత్రి అనిత

మత్తు పదార్థాలకు అలవాటు పడిన వారి కోసం రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో మొత్తం 44 డీ-అడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు హోంమంత్రి వంగలపూడి అనిత సోమవారం అసెంబ్లీలో తెలిపారు. కారాగారాల్లో కూడా డి-అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. డి అడిక్షన్ కేంద్రాల్లో ఉన్నంతకాలం వారికి ఉచిత సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు.
Similar News
News December 8, 2025
TVK సభకు పోలీసుల ఆంక్షలు.. 5వేల మందికే పర్మిషన్

TVK పార్టీ చీఫ్ విజయ్ రేపు పుదుచ్చేరిలో నిర్వహించే సభకు పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. TVK ఇష్యూ చేసిన QR కోడ్ పాసులున్న 5వేల మంది స్థానికులనే సభకు అనుమతిస్తామన్నారు. పిల్లలు, గర్భిణులు, వృద్ధులకు ఎంట్రీ లేదని చెప్పారు. సభ వద్ద తాగునీరు, మరుగుదొడ్లు, అంబులెన్సులు, ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఏర్పాటు చేసుకోవాలని పార్టీని ఆదేశించారు. కరూర్ లాంటి ఘటన మరోసారి జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
News December 8, 2025
NSU లైంగిక వేధింపుల ఘటన.. ముందే తెలిసినా.!

తిరుపతి NSUలో లైంగిక వేధింపుల ఘటన వెలుగులోకి వచ్చినా వర్సిటీ వర్గాలు ఘటనపై ఫిర్యాదు చేసేందుకు వెనుకడుగు వేశాయని పోలీసుల వర్గాల సమాచారం. శనివారం సాయంత్రం వర్సిటీ సిబ్బంది స్టేషన్కు వెళ్లి ‘నిందితుల ఫోన్లు తెచ్చాము, పరిశీలించండి’ అనడంతో పోలీసులు అవాక్కయ్యారట. ఫిర్యాదు చేస్తేనే విచారణ చేపడతామని వారు తెగేసి చెప్పడంతో వేరే దారి లేక ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
News December 8, 2025
నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ

జాతీయ గేయం వందేమాతరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇవాళ పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రత్యేక చర్చ జరగనుంది. లోక్సభలో మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని మోదీ చర్చను ప్రారంభించి సుదీర్ఘంగా ప్రసంగిస్తారు. ఈ గేయంపై 10 గంటలపాటు చర్చ సాగనుంది. రాజ్యసభలో అమిత్షా చర్చను మొదలుపెడతారు. స్వాతంత్ర్య పోరాటానికి స్ఫూర్తినిచ్చిన ‘వందేమాతరం’ చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యతపై పలువురు ఎంపీలు మాట్లాడతారు.


