News July 30, 2024

రాష్ట్రంలో 5, 6 స్థానాల్లో నిజామాబాద్, కామారెడ్డి

image

పోగొట్టుకున్న సెల్‌ఫోన్‌లను గుర్తించి వాటిని బాధితులకు అందించడంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు రాష్ట్రంలో వరుసగా 5, 6 స్థానాల్లో నిలిచాయి. 20 ఏప్రిల్ 2023 నుంచి 14 జులై 2024 వరకు NZB కమిషనరేట్‌లో 6,690 సెల్ ఫోన్లు పోగొట్టుకున్న కేసులు నమోదయ్యాయి. ఇందులో 3,941 గుర్తించి 1,888 ఫోన్‌లను బాధితులకు అందించారు. కామారెడ్డి జిల్లాలో 4,917 కేసులు నమోదు కాగా 2,756 సెల్ ఫోన్లు గుర్తించారు.

Similar News

News February 23, 2026

NZB: డెస్క్ జర్నలిస్ట్‌లకు అక్రిడిటేషన్ ఇవ్వాలి: DJFT

image

మీడియాలో పని చేసే ప్రతి డెస్క్ జర్నలిస్ట్‌కు అక్రిడిటేషన్ ఇవ్వాలని డెస్క్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (DJFT) నాయకులు కోరారు. నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠికి సోమవారం వినతిపత్రం అందజేశారు. ప్రతి డెస్క్ జర్నలిస్ట్‌కు ప్రభుత్వం అక్రిడిటేషన్లు ఇవ్వాలని, అక్రిడిటేషన్ జిల్లా కమిటీలో డెస్క్ జర్నలిస్ట్‌లను నియమించాలని కోరారు. ప్రతి జిల్లాలో 5 అక్రిడిటేషన్‌లు ఇవ్వాలని కోరారు.

News February 22, 2026

NZB: రెండు వారాల్లో 134 DD కేసులు :CP

image

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన రెండు వారాల్లో 134 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు అయినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శనివారం తెలిపారు. 134 మందిని కోర్టుల్లో హాజరు పరచగా రూ 12.10 లక్షల జరిమానా విధించడం జరిగిందన్నారు. అలాగే 13 మందికి వారం రోజుల చొప్పున జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారని CP వివరించారు.

News February 22, 2026

NZB: NAC ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ

image

NAC ఆధ్వర్యంలో నిరుద్యోగ మైనార్టీ యువత కోసం ల్యాండ్ సర్వేలో 3 నెలల ఉచిత శిక్షణ ఇస్తామని NZB అసిస్టెంట్ డైరెక్టర్ లింబాద్రి తెలిపారు. ఈ శిక్షణ ఈనెల 27 నుంచి ప్రారంభమవుతుందన్నారు. 18-35 సంవత్సరాలలోపు ఉండాలన్నారు. ఇంటర్మీడియట్, లేదా ITI సివిల్ చదివినవారు అర్హులన్నారు. వీరికి స్టేషనరీ, యూనిఫామ్ ఉచితం అని, గ్యారెంటీ ప్లేస్మెంట్ కల్పిస్తామన్నారు.