News February 10, 2025

రాష్ట్రంలో 60 శాతం అల్లూరి జిల్లా వాటా: కలెక్టర్

image

గిరిజన రైతులు పండిస్తున్న సంప్రదాయ దేశీయ పసుపు సాగును ప్రోత్సహిస్తామని కలెక్టర్ దినేశ్ కుమార్ సోమవారం తెలిపారు. రాష్ట్రంలో పసుపు సాగులో అల్లూరి సీతారామరాజు జిల్లా 60 శాతం వాటాను ఆక్రమించిందన్నారు. గిరిజన వ్యవసాయ ఉత్పత్తులపై డిల్లీలో చర్చ జరుగుతోందన్నారు. గిరిజన రైతులు సేంద్రియ పసుపును సాగు చేస్తున్నారన్నారు. పసుపు సాగులో గిరిజన రైతులకు మెలకువలపై అవగాహన కల్పిస్తే మంచి దిగుబడులు సాధిస్తారన్నారు.

Similar News

News November 17, 2025

కేయూ జేఏసీ నూతన కమిటీ ఎన్నిక

image

విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాటాలు నిర్వహించేందుకు కేయూ నూతన విద్యార్థి జేఏసీని నేతలు ప్రకటించారు. జేఏసీ ఛైర్మన్‌గా ఆరేగంటి నాగరాజ్, వైస్ ఛైర్మన్‌గా కేతపాక ప్రసాద్, కన్వీనర్‌గా కందికొండ తిరుపతి, కో-కన్వీనర్‌గా అల్లం విజయ్, ప్రధాన కార్యదర్శిగా బోస్కా నాగరాజ్, కార్యదర్శిగా జనగాం రాజారాం, కోశాధికారిగా రేగుల నరేశ్ నియమితులయ్యారు.

ప్రియ జనులారా.. ఉచితమంటే ఎగబడకండి!

image

చాలా మందికి ఉచితం అనే సరికి ఎగబడటం పరిపాటైంది. దీనిమాటున ప్రమాదం పొంచి ఉన్నా గుర్తించట్లేదు. తాజాగా <<18309732>>iBOMMA<<>> విషయంలోనూ ఇదే రుజువైంది. ఉచితంగా సినిమా చూసే క్రమంలో తమకు తెలియకుండానే సమాచారాన్ని వారికి చేరవేశారు. ఈ క్రమంలో 50లక్షల మంది డేటా వారి చేతికి చిక్కిందని పోలీసులు వెల్లడించారు. దీంతో ఫ్రీగా వస్తుందనే సరికి ఆన్‌లైన్‌లో ముందూ వెనకా చూడకుండా వ్యవహరిస్తే ప్రమాదమని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.