News September 9, 2024

రాష్ట్రంలో 80వేల ఎకరాల వక్ఫ్ భూములు: డీకే అరుణ

image

తెలంగాణ రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు పరిధిలో సుమారు 80వేల ఎకరాల భూములు ఉన్నాయని ఎంపీ డీకే అరుణ అన్నారు. మహబూబ్ నగర్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నిరుపేదలకు లబ్ధి చేకూర్చేందుకే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డులో సవరణలు చేపట్టిందన్నారు. ఈ విషయంలో కొందరు పనిగట్టుకొని కేంద్రంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. అభిప్రాయాలు తెలుసుకునేందుకు రాష్ట్రంలో నెలాఖరున జేపీసీ పర్యటన ఉంటుందన్నారు.

Similar News

News October 7, 2024

శ్రీశైలానికి కొనసాగుతున్న వరద..!

image

శ్రీశైలం జలాశయానికి ఆదివారం ఎగువ నుంచి వరద నిలకడగా కొనసాగుతుంది. జూరాల గేట్ల ద్వారా 21,603, విద్యుదుత్పత్తి చేస్తూ 37,252, సుంకేసుల నుంచి 26,874 మొత్తం 85,756 క్యూసెక్కుల నీటి ప్రవాహం శ్రీశైలానికి వస్తుంది. దీంతో భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 35,315 క్యూసెక్కులు, AP జెన్కో పరిధిలోని కుడి గట్టు కేంద్రంలో ఉత్పత్తి చేస్తూ14,379 మొత్తం 49,694 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు.

News October 7, 2024

మహబూబ్‌నగర్: డీఎస్సీ UPDATE

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో DSC అభ్యర్థుల తుది జాబితా నేడు కొలిక్కి రానుంది. మొత్తం 1,077 టీచర్ పోస్టుల భర్తీకి సర్టిఫికెట్ల పరిశీలన ఇప్పటికే ముగిసింది. 1:3లో సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు 2,636 మంది ఎంపిక కాగా 2,440 మంది హాజరయ్యారు. 1:1 జాబితా రాగానే వారికి పోస్టింగ్ ఇస్తామని విద్యాధికారులు తెలిపారు. ఈనెల 9న నియామక పత్రాలు అందించాక కొత్త టీచర్లకు ఆన్‌లైన్‌లో కౌన్సెలింగ్ నిర్వహించే అవకాశం ఉందన్నారు.

News October 7, 2024

MBNR: గ్రామాల్లో మొదలైన ‘పంచాయతీ’ సందడి!

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా పంచాయతీల్లో సర్పంచ్‌గా పోటీ చేయాలనుకునే ఆశావహులు అందరినీ ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే అధికారులు ఓటరు తుది జాబితాను విడుదల చేశారు. ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేస్తున్నారు. దీంతో పంచాయతీల్లో ఎన్నికల సందడి మొదలైంది. MBNR-441, NGKL-463, GDWL-255, NRPT-290, WNPT-255 జిల్లాలో గ్రామపంచాయతీలు ఉన్నాయి.