News July 19, 2024
రాష్ట్రం అభివృద్ధి చెందాలని రొట్టెలు వదలండి: సీఎం చంద్రబాబు

నెల్లూరు దర్గాలో జరిగే రొట్టెల పండుగను సీఎం చంద్రబాబు వీడియో వర్చువల్ ద్వారా వీక్షించారు. అనంతరం భక్తులతో, టీడీపీ నేతలతో లైవ్‌లో మాట్లాడుతూ.. రాష్ట్రం అభివృద్ధి చెంది, బాగా ఆదాయం రావాలని చెరువులో రొట్టెలు వదలమని చంద్రబాబు తెలిపారు. బారాషహీద్ దర్గాలో ఏర్పాటుచేసిన వీడియో వర్చువల్ కార్యక్రమానికి ఎంపీ ప్రభాకర్ రెడ్డి, మంత్రులు నారాయణ, ఆనం, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి హాజరయ్యారు.
Similar News
News July 11, 2025
నెల్లూరులో ప్రారంభమైన రెవెన్యూ క్రీడా వారోత్సవాలు

నెల్లూరు జిల్లా రెవెన్యూ అసోసియేషన్ 10వ క్రీడా వారోత్సవాలను జిల్లా జడ్జి శ్రీనివాసులు, కలెక్టర్ ఆనంద్ ప్రారంభించారు. శుక్రవారం ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, క్రీడాజ్యోతిని వెలిగించి ఆటలను ప్రారంభించారు. మూడు రోజులుపాటు ఈ క్రీడా వారోత్సవాలు జరగనున్నాయి. ఈ పోటీల్లో నెల్లూరు, ఆత్మకూరు, కావలి, కందుకూరు డివిజన్లలోని రెవెన్యూ సిబ్బంది పాల్గొననున్నారు.
News July 11, 2025
మనుబోలు: ఉదయాన్నే రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

మనుబోలు మండలం పల్లిపాలెం వద్ద శుక్రవారం ఉదయాన్నే జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. TPగూడూరు(M) గంగపట్నంకు చెందిన లక్ష్మయ్య (22) కట్టువపల్లిలో రొయ్యల గుంట వద్ద పని చేస్తున్నాడు. ఉదయాన్నే బైకుపై పల్లిపాలెం వెళ్తూ దారిమధ్యలో గేదె అడ్డు రావడంతో ఢీకొట్టాడు. తలకు గాయాలై తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు విచారణ చేపట్టారు.
News July 11, 2025
కాకాణి గోవర్ధన్ రెడ్డికి మరో కేసులో బెయిల్

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి మరో కేసులో ఊరట లభించింది. కృష్ణపట్నం పోర్టు రోడ్ పంట పాలెం వద్ద అక్రమ టోల్ గేట్ పెట్టి వాహనాలకు డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలపై ముత్తుకూరు పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో రైల్వే కోర్ట్ ఇన్‌ఛార్జ్ న్యాయమూర్తి నిషాద్ నాజ్ షేక్ బెయిల్ మంజూరు చేశారు.