News October 17, 2024
రాష్ట్రం తరఫున ఏయూ విద్యార్థినిల ప్రాతినిధ్యం

జాతీయ యువజనోత్సవాలు ప్రజాతంత్ర-2024కు ఏపీ నుంచి ఏయూకి చెందిన ఇద్దరు విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వీరిని ఏయూ ఉపకులపతి ఆచార్య జి.శశిభూషణరావు గురువారం తన కార్యాలయంలో అభినందించారు. నవంబర్ 16 నుంచి 18 వరకు లక్నోలో జరిగే ఈ యువజన ఉత్సవాలలో విద్యార్థినులు ఎం.శివాని లహరి, డి.హర్షిత పాల్గొంటారు. వీరు ఇరువురు రాష్ట్రం తరఫున అక్కడ ప్రాతినిధ్యం వహిస్తారు.
Similar News
News December 7, 2025
విశాఖపట్నం-SMVT బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు

ప్రయాణికుల సౌకర్యార్థం ECO రైల్వే అధికారులు విశాఖ-SMVT బెంగళూరు మధ్య ప్రత్యేక రైలును నడపనున్నట్లు తెలిపారు. విశాఖ–SMVT బెంగళూరు స్పెషల్ విశాఖ నుంచి డిసెంబర్ 8న మధ్యాహ్నం 3:20 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.45కు బెంగళూరు చేరుకుంటుందన్నారు. తిరుగుప్రయాణంలో బెంగళూరు నుంచి డిసెంబర్ 9న మధ్యాహ్నం 3:50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1:30కి విశాఖ చేరుతుందన్నారు.

ప్రైవేటు హాస్పిటల్స్, లాబ్స్ యాజమాన్యంతో DMHO సమావేశం

విశాఖ పరిధిలోని అన్ని ప్రైవేటు హాస్పిటల్స్,లాబ్స్ యాజమాన్యంతో DMHO జగదీశ్వర రావు శనివారం సమావేశం నిర్వహించారు. ప్రైవేటు హాస్పిటల్స్ యజమానులు అందరూ హెచ్.పి.ఆర్, హెచ్.ఎఫ్.ఆర్. రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలనన్నారు. రిసెప్షన్ వద్ద ధరల పట్టికను ప్రదర్శించాలన్నారు. స్క్రబ్ టైఫస్ వ్యాధిపై అవగాహన కల్పించారు. ఈ నెల 21న పల్స్ పోలియోకు సహకరించాలని సూచించారు.