News December 21, 2024

రాష్ట్రపతి నిలయానికి వారికి స్పెషల్ ఎంట్రీ

image

రాష్ట్రపతి నిలయం సందర్శనకు వసతి గృహాల విద్యార్థులకు ప్రత్యేక ప్రవేశం కల్పించనున్నారు. పిక్నిక్ స్పాట్‌లా ఉండేలా పిల్లలకు ప్లే ఏరియా, ఉద్యాన ఉత్సవాన్ని తిలకించేందుకు వసతి గృహాల విద్యార్థులను రాష్ట్రపతి నిలయానికి తీసుకువచ్చి ఆహ్లాదకర వాతావరణంలో జ్ఞాపకాలు గుర్తుండిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అవసరమైన తాగునీరు, అంబులెన్స్, మొబైల్ టాయిలెట్లు, రవాణా, లైటింగ్ వంటి మౌళిక వసతులు కల్పిస్తున్నారు.

Similar News

News October 12, 2025

RR: ఒక్క రోజు పిల్లల కోసం కేటాయించండి

image

పోలీయో.. బాడీలో ఏంజరుగుతుందో తెలిసేలోపే అంతా అయిపోతుంది. అంగవైఖల్యం పిల్లల జీవితాన్ని చిదిమేస్తుంది. 2 చుక్కలతో నిండు జీవితాన్ని మహమ్మారి నుంచి రక్షించండి. పనులు పక్కనబెట్టి నేడు ఉ.7గం.నుంచి పోలీయోడ్రాప్స్ వేయించండి. జిల్లాలోని అంగన్వాడీలు, ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులతో సహా 1,151 చోట్ల బూతులు ఏర్పాటుచేశారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 4,20,911మంది బాలలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

News October 11, 2025

సోమవారం నుంచి మళ్లీ యథావిధిగా ప్రజావాణి

image

స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించినందున రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎన్నికలు వాయిదా పడ్డాయి. కావున రద్దుపరిచిన ప్రజావాణి కార్యక్రమాన్ని యధావిధిగా సోమవారం నుంచి కొనసాగించడం జరుగుతుందని RR జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు, ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ కోరారు.

News October 11, 2025

RR: ఇంటి వద్దకే పోలియో చుక్కలు: DMHO

image

RR జిల్లాలో రేపటి నుంచి పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి లలితాదేవి తెలిపారు. జిల్లాలో 155 మంది రూట్ సూపర్‌వైజర్లు, 6,204 మంది బూత్ టీమ్ మెంబర్లను నియమించామన్నారు. ఆయా బూత్‌లలో ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేస్తామన్నారు. మిగిలిన వారికి 13 నుంచి 15 వరకు ఇంటి వద్దకు వెళ్లి పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు.