News March 6, 2025
రాష్ట్రపతి భవన్లో ఏటికొప్పాక స్టాల్

దేశ రాజధాని ఢిల్లీ రాష్ట్రపతి భవన్లో ఏటికొప్పాక లక్క బొమ్మల స్టాల్‌ను ఏర్పాటు చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కళాకారులు రూపొందించిన బొమ్మలు, కలంకారి వస్త్రాలు తదితర హస్తకళా ప్రదర్శనను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం సాయంత్రం ప్రారంభించినట్లు ఏటికొప్పాక కళాకారుడు శరత్ సత్యనారాయణ తెలిపారు. ఈ ప్రదర్శన ఈనెల తొమ్మిదవ తేదీ వరకు కొనసాగుతుందన్నారు.
Similar News
News November 22, 2025
కాకినాడ, రాజమండ్రి ప్రభుత్వాసుపత్రుల నిర్లక్ష్యంపై CM ఆగ్రహం

AP: ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంపై CM చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు. కాకినాడ GGHలో గడిమొగకు చెందిన 8నెలల గర్భిణి మల్లేశ్వరి ప్రాణాలు కోల్పోవడం, రాజమండ్రి ఆసుపత్రిలో 55ఏళ్ల రోగికి ఎక్స్‌పైరైన మందులివ్వడంతో ఆ రోగి మరింత అనారోగ్యం పాలయ్యారు. ఈ ఘటనలపై పూర్తి స్థాయి విచారణ జరపాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
News November 22, 2025
జనగామ: రేపు సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారు

జనగామ జిల్లాలో ఆదివారం సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించిన మహిళా రిజర్వేషన్ల ప్రక్రియను లాటరీ పద్ధతి ద్వారా నిర్వహించనున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. ఉదయం 9.30 గంటలకు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఆర్డీఓ ఆఫీసులో జీఓ 46 ప్రకారం సర్పంచ్ స్థానాలకు మహిళా రిజర్వేషన్లు, అన్ని ఎంపీడీఓ ఆఫీసుల్లో వార్డు సభ్యుల స్థానాలకు మహిళా రిజర్వేషన్ల ప్రక్రియ జరుగుతుందని వివరించారు.
News November 22, 2025
గుర్తులేదు.. మరిచిపోయా: ఐబొమ్మ రవి

TG: మూడో రోజు పోలీసుల విచారణలో ఐబొమ్మ రవి సమాధానాలు దాట వేసినట్లు తెలుస్తోంది. అడిగిన ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెప్పాడట. బ్యాంకు ఖాతాల వివరాలపైనా నోరు విప్పలేదని సమాచారం. యూజర్ ఐడీ, పాస్వర్డ్లు అడిగితే గుర్తులేదని, మరిచిపోయానని తెలిపినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో ఎథికల్ హ్యాకర్ల సాయంతో హార్డ్‌డిస్క్‌లు, పెన్‌డ్రైవ్‌లు ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.


