News March 6, 2025

రాష్ట్రపతి భవన్‌లో ఏటికొప్పాక స్టాల్

image

దేశ రాజధాని ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లో ఏటికొప్పాక లక్క బొమ్మల స్టాల్‌ను ఏర్పాటు చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కళాకారులు రూపొందించిన బొమ్మలు, కలంకారి వస్త్రాలు తదితర హస్తకళా ప్రదర్శనను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం సాయంత్రం ప్రారంభించినట్లు ఏటికొప్పాక కళాకారుడు శరత్ సత్యనారాయణ తెలిపారు. ఈ ప్రదర్శన ఈనెల తొమ్మిదవ తేదీ వరకు కొనసాగుతుందన్నారు.

Similar News

News February 17, 2026

మానవత్వం చాటుకున్న మంత్రి సత్యకుమార్

image

రోడ్డు ప్రమాద క్షతగాత్రులను చూసిన వెంటనే వారిని ఆసుపత్రికి తరలించి మంత్రి సత్యకుమార్ యాదవ్ మానవత్వం చాటుకున్నారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత మంగళగిరిలో జరిగే మరో కార్యక్రమానికి వెళ్తుండగా ఎయిమ్స్ సమీపంలో బైకులు ఢీకొని ఓ యువతి, వ్యక్తి గాయపడటాన్ని గమనించారు. మంత్రి వెంటనే తన వాహనం నుంచి దిగి క్షతగాత్రులకు సపర్యలు చేసి పరామర్శించారు. అనంతరం అంబులెన్సు‌లో ఎయిమ్స్‌కి పంపించారు.

News February 17, 2026

పంచాయతీలకు రూ.250 కోట్లు

image

TG: గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దాదాపు రూ.250 కోట్లను విడుదల చేసింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కాంట్రాక్టర్ల బిల్లులను చెల్లించడానికి ఈ నిధులను వినియోగిస్తారు. అలాగే గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, రోడ్ల మరమ్మతులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ఉపయోగిస్తారు. ఇటీవల 15వ ఆర్థిక సంఘం రాష్ట్రానికి రూ.387 కోట్లను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.