News January 22, 2025
రాష్ట్రపతి విందుకు చిత్తూరు మహిళ

రాష్ట్రపతితో విందుకు చిత్తూరు మహిళకు ఆహ్వానం అందింది. రిపబ్లిక్‌డే సందర్భంగా వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులను దేశవ్యాప్తంగా ఎంపిక చేశారు. ఇందులో భాగంగా PMAY పథకంలో చిత్తూరు న్యూ ప్రశాంత్ నగర్‌లోని సల్మా ఎంపికయ్యారు. ఆహ్వాన లేఖను పోస్టల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ గణపతి అందజేశారు. సల్మాతో పాటు ఆమె భర్తకు ఢిల్లీకి రాకపోకలు, వసతి ఖర్చులను రాష్ట్ర భవన్ భరిస్తుందని లేఖలో తెలిపారు.
Similar News
News February 16, 2025
చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

గంగవరం మండలంలో నాలుగు రోడ్ల వద్ద రెండు బైకులు ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. రెండు బైకులు అధిక వేగంతో వస్తూ ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడగా 108 వాహనంలో పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 16, 2025
చిత్తూరులో చికెన్ ధరలు ఇవే

చిత్తూరులో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. బ్రాయిలర్ కోడి రిటైల్ ధర కేజీ రూ.148, లేయర్ రూ.136, స్కిన్ లెస్ రూ.168. బర్డ్ ఫ్లూ నేపథ్యంలో ధరలు భారీగా తగ్గినట్లు వ్యాపారులు వాపోయారు. గిట్టుబాటు ధర లభించడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మీ ఊరిలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News February 15, 2025
చిత్తూరు జిల్లా అభివృద్ధి సమన్వయ సమావేశం

చిత్తూరు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ సుమిత్ కుమార్, ఎంపీ ప్రసాదరావు హాజరయ్యారు. పలు అంశాలపై అధికారులతో వారు చర్చించారు. జడ్పీ సీఈవో రవి కుమార్ నాయుడు, అధికారులు చంద్రశేఖర్ రెడ్డి, విజయ్ కుమార్, రవి కుమార్, గోపాల్ నాయక్, వరలక్ష్మి తదితరులు హాజరయ్యారు.