News November 16, 2025

రాష్ట్రపతి CP రాధాకృష్ణన్‌ని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి

image

హైదరాబాద్ పర్యటనకు వచ్చిన భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ని సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఇచ్చిన తేనీటి విందు కార్యక్రమంలో ఉప రాష్ట్రపతితో కలిసి సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం ఉప రాష్ట్రపతిని సత్కరించారు. గవర్నర్ రాజ్ భవన్‌లో ఏర్పాటు చేసిన ఈ విందులో సీఎంతో పాటు శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

Similar News

News April 5, 2026

HYD: GREAT.. గోల్డ్ మెడల్ కొట్టిన బేగం

image

ఇండియా స్కిల్స్ 2026లో లాజిస్టిక్స్ & ఫ్రైట్ ఫార్వార్డింగ్ విభాగంలో నగరానికి చెందిన మెహ్రునిషా బేగం గోల్డ్ మెడల్ సాధించి రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారు. జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఆమె ప్రయాణం కృషి, పట్టుదలకి నిదర్శనం. బేగంపేట డిగ్రీ కాలేజీ అలుమ్ని అయిన ఆమె ప్రస్తుతం కార్గోమాన్ లాజిస్టిక్స్‌లో పనిచేస్తున్నారు.

News April 5, 2026

నేడు దద్దరిల్లనున్న HYD

image

నేడు HYD‌లో ఐపీఎల్ సందడి నెలకొననుంది. ఉప్పల్‌ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో మన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తలపడనుంది. సొంతగడ్డపై జరుగుతున్న మ్యాచ్ కావడంతో నగర క్రికెట్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. భాగ్యనగర గడ్డపై ‘ఆరెంజ్ ఆర్మీ’ విజయకేతనం ఎగరవేయాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మ్యాచ్ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు, నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.