News February 21, 2025
రాష్ట్రస్థాయిలో పతకం సాధించిన మంచిర్యాల బిడ్డ

కోటపల్లి మండలం నాగంపేటకు చెందిన ఈర్ల సంపత్ రాష్ట్ర స్థాయిలో సత్తా చాటి పురుషుల విభాగంలో పతకం సాధించాడు. కోచ్ సల్ఫల సంతోష్ యాదవ్ మాట్లాడుతూ.. ఈనెల 18నుంచి 19 వరకు ఉస్మానియా యూనివర్సిటీ క్రీడామైదానంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి యూత్ అథ్లెటిక్స్ క్రీడా పోటీల్లో షాట్ పుట్‌లో సంపత్ అత్యంత ప్రతిభ కనబరిచి బ్రాంజ్ మెడల్ సాధించాడన్నారు. పతకం సాధించిన సంపత్‌ను జిల్లా క్రీడాకారులు అభినందించారు.
Similar News
News March 27, 2025
WGL: CONGRESS VS BRS.. రంగంలోకి మీనాక్షి!

TG కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ బుధవారం WGL, HNK, MLG, JN, BHPL, MHBD డీసీసీ కమిటీలతో మీటింగ్ పెట్టారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నా ఎందుకు వ్యతిరేకత వస్తోందని అడిగారు. జిల్లాల వారీగా కాంగ్రెస్ పార్టీ బలంపై చర్చించారు. కాంగ్రెస్ పై BRSచేస్తోన్న ఆరోపణలను క్షేత్రస్థాయి నుంచే బలంగా తిప్పికొట్టాలని చెప్పినట్లు సమాచారం. కాగా నేడు డీసీసీలతో ఢిల్లీలో అధిష్ఠానం సమావేశం కానుంది.
News March 27, 2025
మాచర్ల: రోడ్డు ప్రమాదంలో మరో యువకుడి మృతి

మాచర్లలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్ చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో గాయపడిన మరో యువకుడు ప్రాణాలు విడిచాడు. అర్ధవీడు(M)నారాయణపల్లికి చెందిన ఆర్మీ జవాన్ ఇంద్రసేనారెడ్డి(27), మార్కాపురం(M) మిట్టమీదపల్లికి చెందిన కాశిరెడ్డి(29) నాగార్జునసాగర్‌లోని బంధువుల ఇంటికి బైక్‌పై వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తుండగా మాచర్ల(M) కొత్తపల్లి జంక్షన్ వద్ద DCM వీరిని ఢీకొట్టింది.
News March 27, 2025
KMR: CONGRESS VS BRS.. రంగంలోకి మీనాక్షి!

TG కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ బుధవారం నిజామాబాద్, కామారెడ్డి డీసీసీ కమిటీలతో మీటింగ్ పెట్టారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నా ఎందుకు వ్యతిరేకత వస్తోందని అడిగారు. జిల్లాల వారీగా కాంగ్రెస్ పార్టీ బలంపై చర్చించారు. కాంగ్రెస్ పై BRSచేస్తోన్న ఆరోపణలను క్షేత్రస్థాయి నుంచే బలంగా తిప్పికొట్టాలని చెప్పినట్లు సమాచారం. కాగా నేడు డీసీసీలతో ఢిల్లీలో అధిష్ఠానం సమావేశం కానుంది.