News February 18, 2025
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఆసిఫాబాద్ బిడ్డలు

సిర్పూర్ (యు) మండల కేంద్రంలో ఆదర్శ పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సబ్ జూనియర్ బాల బాలికల జిల్లా జట్టు ఎంపిక పోటీల్లో విద్యార్థులు శ్వేత, నిఖిత, అమూల్య, ప్రభాస్ ఎంపికయ్యారని ప్రిన్సిపల్ మిట్ట వెంకటస్వామి, పీడీ ధర్మారావ్ సోమవారం ప్రకటనలో తెలిపారు. 34వ రాష్ట్రస్థాయి పోటీలలో వీరు పాల్గొంటారని చెప్పారు.
Similar News
News December 9, 2025
వంటింటి చిట్కాలు

* పాయసం చేసేటప్పుడు ఉప్పు కలిపితే రుచి పెరుగుతుంది.
* అన్నం అడుగంటకుండా ఉండాలంటే దానిలో నెయ్యి, కాస్త నిమ్మరసం కలిపితే సరి. అన్నం తెల్లగా, పొడిపొడిగానూ అవుతుంది.
* గ్రేవీ రుచి పెరగాలంటే మసాలా దినుసులను వేయించేప్పుడు అర చెంచా చక్కెర జత చేసి చూడండి. చక్కటి రంగుతోపాటు రుచి రెండింతలవుతుంది.
* ఉల్లిపాయలను, బంగాళాదుంపలను విడివిడిగా పెట్టకపోతే తేమ కారణంగా రెండూ పాడవుతాయి.
News December 9, 2025
స్వరాష్ట్ర కలను సోనియా సాకారం చేశారు: రేవంత్

TG: సరిగ్గా ఇదే రోజున 2009లో తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ చేసిన ప్రకటన రాష్ట్ర ప్రజలకు సంతోషాన్నిచ్చిందని సీఎం రేవంత్ అన్నారు. 4 కోట్ల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా స్వరాష్ట్ర కలను సోనియా సాకారం చేశారన్నారు. ఆ కారణంగానే ఈ రోజున తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణలో ఆయన వర్చువల్గా పాల్గొన్నారు.
News December 9, 2025
కడప SPని ఆశ్రయించిన ప్రేమ జంట.!

తమను చంపేస్తామని తల్లిదండ్రులు బెదిరిస్తున్నారని ఓ ప్రేమజంట కడప SPని కలిసింది. వేల్పులకి చెందిన సుష్మాన్ బేగం, కొండూరుకి చెందిన మనోహర్ ప్రేమించుకున్నారు. అనంతరం చీమలపెంట వద్ద ఓ శివాలయంలో వివాహం చేసుకున్నారు. తరువాత పోలీసులను ఆశ్రయించగా తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడారు. వీరి కులాలు వేర్వేరు కావడంతో వారి తల్లిదండ్రులు వీరి ప్రేమను ఒప్పుకోలేదని, తమకు ప్రాణహాని ఉందని SPని ఆశ్రయించారు.


