News February 18, 2025

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఆసిఫాబాద్ బిడ్డలు

image

సిర్పూర్ (యు) మండల కేంద్రంలో ఆదర్శ పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సబ్ జూనియర్ బాల బాలికల జిల్లా జట్టు ఎంపిక పోటీల్లో విద్యార్థులు శ్వేత, నిఖిత, అమూల్య, ప్రభాస్ ఎంపికయ్యారని ప్రిన్సిపల్ మిట్ట వెంకటస్వామి, పీడీ ధర్మారావ్ సోమవారం ప్రకటనలో తెలిపారు. 34వ రాష్ట్రస్థాయి పోటీలలో వీరు పాల్గొంటారని చెప్పారు.

Similar News

News April 15, 2026

1,250 మెకనైజడ్ బోట్లను ఇవ్వాలనుకున్నాం: YS జగన్

image

తాము జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌లో 1,250 మెకనైజడ్ బోట్లకు సదుపాయం కలిగేలా నిర్మాణం చేపట్టామని మాజీ CM జగన్ అన్నారు. ఆ బోట్లను కేవలం 10% మత్స్యకారులు కట్టుకుంటే, 40% రాయితీ ఇచ్చి, మిగిలిన దాన్ని లోన్ రూపంలో అందించే వాళ్లమన్నారు. అదే జరిగితే ఇప్పటికి 15 మంది మత్స్యకారులు ఆ బోట్లకు యజమానులై ఉండేవారన్నారు. కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు, ఐస్ ప్లాంట్లు నడిచేవని, బోట్ల రిపేరు యూనిట్లు పనిచేసేవన్నారు.

News April 15, 2026

మూడు జిల్లాల్లో 4 వేలకు పైగా స్లాట్ బుకింగ్స్

image

మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో గత నాలుగు నెలల్లో రిజిస్ట్రేషన్ల కోసం 4 వేలకుపైగా స్లాట్ బుకింగ్స్ నమోదయ్యాయి. రియల్ ఎస్టేట్ లావాదేవీలు పెరగడం, ఆస్తుల కొనుగోలు విక్రయాలు అధికమవడం దీనికి కారణంగా అధికారులు తెలిపారు. ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్ విధానం వల్ల పారదర్శకత పెరిగి, ప్రజలకు సులభంగా సేవలు అందుతున్నాయి. రాబోయే రోజుల్లో మరింత పెరుగుదల ఉండొచ్చని అంచనా వేశారు.

News April 15, 2026

శ్రీకాకుళం: కేజీబీవీ జూనియర్ కళాశాలల్లో 87.82 శాతం ఉత్తీర్ణత

image

శ్రీకాకుళం జిల్లాలో 25 కేజీబీవీ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం 772 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 678 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు సమగ్ర శిక్ష జిల్లా ఏపీసీ పి.వేణుగోపాలరావు బుధవారం తెలిపారు. 87.82 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు. అత్యధికంగా 978 మార్కులు వచ్చాయని అన్నారు. నాలుగు కేజీబీవీలు శత శాతం ఫలితాలు సాధించాయని చెప్పారు.