News October 30, 2024

రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఉప్పరపల్లి విద్యార్థి ఎంపిక

image

చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన గునుగంటి శ్రీజ రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికైంది. ఇటీవల ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి పోటీల్లో శ్రీజ ప్రతిభ కనబరిచింది. వచ్చే నెల 2,3,4 తేదీల్లో కామారెడ్డి జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననుంది. ప్రధానోపాధ్యాయురాలు జయ, ఉపాధ్యాయులు శ్రీజను అభినందించారు.

Similar News

News October 30, 2024

కొడకండ్ల: పురుగు మందు డబ్బాతో ధర్నాకు దిగిన మాజీ సర్పంచ్

image

జనగామ జిల్లా కొడకండ్ల మండలం పెద్దబాయి తండా గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట పురుగు మందు డబ్బాలతో మాజీ సర్పంచ్ దంపతులు ధర్నాకు దిగారు. రూ. 20 లక్షలు అప్పు తెచ్చి గ్రామపంచాయతీ భవనాన్ని నిర్మించగా, ఇంతవరకు బిల్లులు రాలేదని మాజీ సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. నిధులు విడుదల చేయమంటే అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

News October 29, 2024

జాతీయస్థాయి సెమినార్‌కు వరంగల్ విద్యార్థి

image

చెన్నారావుపేట మండలం లింగాపురం గ్రామానికి చెందిన ZPHS 9వ తరగతి విద్యార్థి భూర వినయ్ కుమార్ ఈరోజు హైదరాబాదులోని SCERTలో జరిగిన రాష్ట్రస్థాయి సైన్స్ సెమినార్‌లో మొదటి స్థానం కైవసం చేసుకొన్నాడు. నవంబర్ 26న ముంబైలోని నెహ్రూ సైన్స్ సెంటర్‌లో జరిగే జాతీయ స్థాయి సైన్స్ సెమినార్‌కు ఎంపికయ్యాడని వరంగల్ DEO మామిడి జ్ఞానేశ్వర్, WGL జిల్లా సైన్స్ అధికారి డాక్టర్ కట్ల శ్రీనివాస్ తెలిపారు.

News October 29, 2024

RTC వరంగల్ రీజియన్‌కు ఎలక్ట్రిక్ బస్‌లు

image

ఆర్టీసీ వరంగల్ రీజియన్‌కు కాలుష్య రహిత ఎలక్ట్రిక్ బస్‌లు వస్తున్నాయని ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డీ.విజయ భాను తెలిపారు. సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్‌ప్రెస్, సెమీడీలక్స్ మొత్తం 82 బస్‌లు వస్తున్నాయన్నారు. వీటిని హనుమకొండ నుంచి HYD, నిజామాబాద్, KNR, ఏటూరునాగారం, మంగపేట, ఖమ్మం రూట్లలో నడుపనున్నట్లు తెలిపారు. అత్యాధునిక సౌకర్యాలు కలిగి ఉన్నాయన్నారు. వచ్చే నెలలో నడుస్తాయన్నారు.